నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన తెలంగాణ మంత్రి పువ్వాడ

Related image

ఖమ్మం: కరోనా వైరస్ లాక్ డౌన్ లో భృతి కోల్పోయిన ఖమ్మం నగర ఆటో కార్మికులకు ఖమ్మం నగర పోలీస్ ఆధ్వర్యంలో సమకూర్చిన నిత్యావసర సరుకులు, కూరగాయలను 1200 మంది కార్మికులకు శుక్రవారం SR&BGNR కళాశాల మైదానంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, అదనపు డిసిపి మురళీధర్, ఏసీపీ లు రామోజీ రమేష్, వెంకట్ రెడ్డి, సిఐలు గోపి, చిట్టిబాబు, వెంకన్న బాబు, కరుణాకర్, వర్తక సంఘం అధ్యక్షులు చిన్ని కృష్ణ రావు, ఆర్జేసి కృష్ణ తదితరులు ఉన్నారు.

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం తనికెళ్ల, సింగరాయిపాలెం గ్రామాలల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లు చేసిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నిల్వలు, తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీలు, రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ అధికారులను ఆదేశించారు. అనంతరం సింగరాయిపాలెం గ్రామంలోని నర్సరీని మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, ఎమ్మెల్యే రాములు నాయక్, మార్కుఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఖమ్మం డిసిసి బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు ఉన్నారు.

కరోనా నేపథ్యంలో మూతపడిన దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరం  కమాన్ బజార్, కస్బా బజార్ లోని వివిధ వ్యాపార సముదాయాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటికే దుకాణం విడచి దుకాణం తెరిచే(సరి, బేసి) విధంగా నగరపాలక సంస్థ ఆదేశాలు ఇచ్చింది. ఆయా సముదాయంలో దుకాణంలో భౌతిక దూరం ఏర్పాట్లను మంత్రి పువ్వాడ పరిశీలించారు. షాపులో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించే విధంగా యజమానులు చర్యలు తీసుకోవలన్నారు. దూరం పాటించకుండా కార్యకలాపాలు జరిపితే వారిపై తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. అనంతరం పువ్వాడ ఫౌండేషన్ ఆద్వర్యంలో సమకూర్చిన శానిటైజర్లు, మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు. వారి వెంట మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి IAS తదితరులు ఉన్నారు.

More Press Releases