విశాఖపట్నం ఘటనకు భాద్యత వహిస్తూ పరిశ్రమల శాఖ మంత్రి రాజీనామా చేయాలి: మేడా శ్రీనివాస్ డిమాండ్

Related image

  • ఫ్యాక్టరీస్, పిసిబి యంత్రాంగం అవినీతి, నిర్లక్ష్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి మొత్తం కేసును సిబిఐ కు అప్పగించాలి
  • భాదిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఫ్యాక్టరి యాజమాన్యం నుండి కోటి రూపాయలు నష్ట పరిహారం ఇప్పించాలి: మేడా శ్రీనివాస్ డిమాండ్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
విశాఖపట్నం ఎల్జీ పాలిమరర్స్ ఇండియా (ప్రై)లిమిటెడ్ ఫ్యాక్టరిలో విష వాయువు లీక్ ఘటనలో పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు, సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం, పరిశ్రమల శాఖ అవినీతి, నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనబడుతుంది అని, కంటి తుడుపు చర్యగా ప్రజల దృష్టి మళ్లించటానికి ప్రభుత్వం నుండి ఏపీ ముఖ్యమంత్రి జగన్ భాదితులకు నష్ట పరిహారం ప్రకటించి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపణ చేశారు.

బాధితులను పరామర్శించటానికి వచ్చిన ముఖ్యమంత్రి ఇంత ఘోర ప్రాణ నష్టానికి భాద్యులైన ఫ్యాక్టరి యాజమాన్యంను తక్షణం అరెస్టు చేయించకుండా, ఫ్యాక్టరీకి సీలు వేయించకుండా నష్టపరిహారం ప్రకటించి వైసిపి క్యాడర్ తో చప్పట్లు కొట్టించుకోవటం అన్యాయమైన చర్యగా భావించాలని ఆయన ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి విచ్చేసిన కారణం బాధితులకు న్యాయం చేయటానికా ! యాజమాన్యం ను రక్షించటానికా అన్నట్టు వుందని, కళ్లెదుట కనబడుతున్న ఈ ఘోర దుర్ఘటన ముఖ్యమంత్రికి నమ్మకం కలగక లోతుగా అధ్యయనం చేస్తానంటు ఒక కమిటీని వేసి ఫ్యాక్టరి యాజమాన్యంను రక్షిస్తున్నారా! ప్రభుత్వం వేసిన కమిటిలో ఇండస్ట్రీస్ & ఫ్యాక్టరీస్ విభాగం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవినీతి నిర్లక్ష్యం మెండుగా వుందని, ఇలాంటప్పుడు కమిటిలో వీరికి స్థానం కల్పించటంలో కుట్ర దాగి వుందని ఆయన ఆరోపణ చేశారు.
 
పురాతన కాలంలో స్థాపించిన ఆ ఫ్యాక్టరి లో సిలెండర్లు, పైపులు, బ్రాయిలర్స్, సేఫ్టీ మెజర్స్, భద్రతా ప్రమాణాల పనితీరుపై సంబంధిత యంత్రాంగం ఎన్నడైనా పర్యవేక్షణ జరిపిందా ! కాలం చెల్లిన పరికరాలు, మిషనరీని, ఇతర ముఖ్య భాగాలను, పరికరాలును మార్చమని, కాలుష్య నియంత్రణ ప్రమాణాలపైన యాజమాన్యంకు లిఖిత పూర్వకంగా తెలిపారా ! యాజమాన్య నిర్లక్ష్య చర్యలపై ప్రభుత్వానికి ఎన్నడైనా నివేదిక ద్వారా తెలిపారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ముఖ్యమంత్రితో పాటుగా పరిశ్రమల మంత్రివర్యులు రాకపోవటానికి గల కారణాలు ప్రజలకు వివరించగలరా అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన పై విశాఖపట్నం నివాశి ఒక విశ్రాంతి IAS అధికారి EAS శర్మ ఈ ఫ్యాక్టరీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని, గతంలో కూడా అనేక చిన్న చితక ప్రమాదాలు జరిగాయని, ఏ విధమైన భద్రతా ప్రమాణాలు పాటించటం లేదని ఈ ఫ్యాక్టరి కారణంగా విశాఖపట్నం ప్రజలకు ప్రమాదం పొంచి వుందని ముఖ్యమంత్రి జగన్ కి లిఖిత పూర్వక పిర్యాదు చేయటం విశేషం. ఈ ఘోర ఘటనకు భాద్యులైన యాజమాన్యంను ముందుగా ఎయిర్ పోర్ట్ లో కలసి వారితో మాటా మంతి అనంతరం భాదితులను పరామర్శించడం గమనిస్తే కోటి రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించినదా! యాజమాన్యం సూచనలు మేరకు ముఖ్యమంత్రి ప్రకటించారా అని ఆయన సందేహం వ్యక్త పరిచారు.
 
ఈ మొత్తం ఘటనకు బాధ్యత వహిస్తు ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి రాజీనామా చేయాలి. ఫ్యాక్టరీని సీజ్ చేయాలి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయిలతో పాటు ఫ్యాక్టరి యాజమాన్యం నుండి మరణించిన వారికి ఒక కోటి, పూర్తి స్థాయి క్షతగాత్రులకు 50 లక్షలు, ఇతర బాధితులకు, జీవాలకు, అంచనా మేరకు నష్ట పరిహారం, ఈ గ్యాస్ లీక్ కారణంగా ముందు ముందు సంభవించు అనారోగ్యాలకు సంబందించి వెంకటాపురం, నందమూరి నగర్, ఎస్వీ బిసి కాలనీ, పద్మనాభపురం ఇతర ప్రాంత భాదిత గ్రామ ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వం నియమించిన కమిటిని రద్దు పరచి ఈ కేసు ఘటనను సిబిఐ కి ఏపీ ప్రభుత్వం అప్పగించాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

More Press Releases