తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చిన శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్

Related image

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోన మహమ్మారి నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తోడుగా నిలిచారు. మార్చి, ఏప్రిల్ నెలకి చెందిన తమ వేతనం లోంచి 75 శాతం జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)కి విరాళంగా ఇచ్చారు. గుత్తా సుఖేందర్ రెడ్డి రూ.5,26,500, పోచారం శ్రీనివాస రెడ్డి రూ.5,26,500 చెక్ లను అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహ చార్యులు ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.

Telangana
Corona Virus

More Press Releases