వ్యవసాయ రంగంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పకడ్బందీగా అమలు చేయాలి: తెలంగాణ మంత్రి పువ్వాడ

Related image

ఖమ్మం: కరోనా వైరస్ నేపథ్యంలో వ్యవసాయ రంగంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పకడ్బందీగా జిల్లాలో అమలు చేయాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం జడ్పీ మిటింగ్ హాల్ నందు జిల్లా వ్యవసాయ అధికారులు, ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్లు తో సమీక్ష నిర్వహించారు. వానాకాలం సీజన్ లో ధాన్యం కొనుగోలు, నిల్వలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా సమస్యలపై చర్చించారు. వానాకాలం పంటకు సంబంధించి సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

విత్తనాభివృద్ది సంస్థ ద్వారా పచ్చి రొట్ట విత్తనాలైన  జీలుగ, పెసర జనుము, వరి విత్తనాలు, వాణిజ్య పంటలైన పత్తి, మిరప విత్తనాలు సకాలంలో సమకూర్చుకుని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పత్తి పంటకు సంబంధించి 6.90 లక్షలు పాకెట్స్ అందుబాటులోకి ఆదేశించారు. చెరువులో నీళ్లు పుష్కలంగా ఉన్నందున సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, జిల్లా కలెక్టర్ కర్ణన్ గారు, పోలీస్ కమీషనర్ తఫ్సిర్ ఇక్బాల్ గారు, వ్యవసాయ అధికారి JDA ఝాన్సీ లక్ష్మీ కుమారి గారు, శ్రీనివాస్ నాయక్, పురుగు మందులు డీలర్లు, మనోహర్, రామబ్రహ్మం గారు, ఎరువుల డీలర్స్ ప్రతినిధి పి నాగేందర్ గారు, విత్తనాల డీలర్స్  తదితరులు ఉన్నారు.

Corona Virus
Telangana
Puvvada Ajay Kumar

More Press Releases