తెలంగాణ ప్రభుత్వానికి రూ.40 కోట్ల విరాళం అందించిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్

Related image

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు, లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా ఉండడం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వానికి రూ.40 కోట్ల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సింగరేణి సిఎండి ఎన్. శ్రీధర్ ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు అందించారు.

తెలంగాణ ప్రభుత్వానికి లలితా జ్యువెల్లర్స్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును లలిత జ్యువెల్లర్స్ సిఎండి డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ సీఎంకు అందించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలకు కూడా చెరో కోటి రూపాయల విరాళం అందిస్తున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి వారిద్దరికీ ధన్యవాదాలు తెలిపారు.

KCR
singareni
Telangana
Corona Virus
Lockdown

More Press Releases