ఈరోజు నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు: సీఎం కేసీఆర్

Related image

వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుండి బీహార్, ఒడిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు రైళ్లు నడుపనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జిఎం గజానన్ మాల్యతో మాట్లాడిన సీఎం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు తరలించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారులుగా సందీప్ సుల్తానియా, ఐఏఎస్, జితేందర్, ఐపిఎస్ లను ప్రభుత్వం నియమించింది.

వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న కార్మికులను ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా తమ స్వస్థలాలకు చేరుస్తారు. ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసినందున ఎవరూ ఆందోళన చెందవద్దని సీఎం కోరారు. కార్మికులను ఈ విషయంలో సమన్వయం చేయాల్సిందిగా పోలీసు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

KCR
TRS
Telangana
Corona Virus

More Press Releases