కరోనా ఖతమయ్యే వరకూ లాక్ డౌన్ ని పాటిద్దాం: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి
- వితరణలతో మీ విశిష్టతను నిరూపించుకోండి
- ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోండి
- విద్యా వైద్యంతోపాటు సామాజిక, చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి
- గర్బిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం అభినందనీయం
- వందేమాతరం పౌండేషన్ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలి
- ఇంట్లో ఇంకుడు గుంతల పరిశీలన
- అమ్మపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన
- తొర్రూరులో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్బిణీలు, బాలింతలు 400 మందికి నిత్యావసర సరుకుల పంపిణీ
- పెద్ద వంగరలో గ్రామ ఎంపీటీసీ ఏదునూరి సిరి శ్రీనివాస్ నిత్యావసర సరుకుల పంపిణీ
- తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ
- అన్ని చోట్లా ప్రజలకు మంత్రి స్వయంగా మాస్కుల పంపిణీ
- వరంగల్ రూరల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కరోనా ప్రస్తుతం మన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కంట్రోల్ లోనే ఉందన్నారు. ఈ విషయమై ఇప్పటికే సీఎం కెసిఆర్ అభినందించారన్నారు. సిఎం కెసిఆర్ మాటలను నిలబెట్టుకునే విధంగా మరికొద్ది రోజుల పాటు మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ ని పాటించాలని ఎర్రబెల్లి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో నిరుపేదలను ఆదుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజలను కోరారు.
పర్వతగిరిలో...: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ ఇంట్లో ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షపు నీటి చుక్క చుక్కని ఒడిసి పట్టుకోవాలని చెప్పారు. ఇంకుడు గుంతలతో భూ గర్భ జలాలు పెరుగుతాయని, తద్వారా నీటి కొరతను అదిగమించవ చ్చని మంత్రి అన్నారు. తమ ఇంట్లో ఇంకుడు గుంతను మరింత మెరుగ్గా తయారు చేయడానికి అవసరమైన సూచనలు చేశారు.
అమ్మాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురంలో మంత్రి ఎర్రబెల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రైతులతో, అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలు విన్నారు. కాస్త ఆలస్యమైనా, రైతులు పండించిన ప్రతి గింజను, ఆఖరు గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతులు ఆందోళన చెంద వద్దన్నారు. అనేక సమస్యలను అదిగమించి, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కెసిఆర్ పంటలకు కనీస మద్దతు ధరలు చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారన్నారు. రవాణా, గన్నీ బ్యాగులు, గోదాములు వంటి సమస్యలను త్వరలోనే అదిగమిస్తామన్నారు. అయితే, ఆయా సమస్యలను అర్థం చేసుకుని రైతులు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
తొర్రూరులో... వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో... గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ: కాగా, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా వందేమాతరం ఫౌండేషన్ 400 మంది గర్బిణీలు, బాలింతలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యా, వైద్య రంగాలతోపాటు సమాజిక సేవకు దిగిన వందేమాతరం ఫౌండేషన్ ని అభినందించారు. కొత్తగా ఆలోచించి, గర్బిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేయడం విశేషంగా ఉందని, ఫౌండేషన్ మరిన్ని కార్యక్రమాలు చేయాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవిందర్ రావు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద వంగరలో...: పెద్ద వంగరలో స్థానిక ఎంపీటీసీ సిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను మంత్రి ఎర్రబెల్లి నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు తమ ఉదారతను చాటుకునే సమయమిదన్నారు. ఎన్నికల్లో లక్షలు తగలేడయం కాదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటనే విలువ, గౌరవం పెరుగుతాయన్నారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ: కరోనా నివారణలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కవితక్క ఆదేశాల మేరకు లక్ష మాస్కుల పంపిణీ లో లో భాగంగా 5వేల మాస్కులను ఆ సంస్థ యూత్ నాయకులు కోరబోయిన విజయ్ కుమార్, మారుపల్లి మాధవి తదితరులు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లికి అందచేశారు. ఆ మాస్కులను ప్రజలకు పంపిణీ చేయాలని కోరారు.
కాగా, ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, గర్భిణీలు, బాలింతలు, నిరుపేదలు తదితరులు పాల్గొన్నారు.