విపత్తు సమయంలో ప్రజలను ఆదుకోవాలి: తెలంగాణ మంత్రి అల్లోల‌

Related image

  • దాతలు ముందుకు రావాలి
నిర్మ‌ల్, ఏప్రిల్ 30: కరోనా సంక్షోభం సమయంలో ఉదార విరాళాలు ఇవ్వడానికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాల‌ని తెలంగాణ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కోరారు. ప‌ట్ట‌ణంలోని ఓ హోట‌ల్ లో ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ నియంత్రణకు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేసేందుకు, కామన్‌ క్వారంటైన్‌లో వసతులు కల్పించేందుకు విరాళాలు ఇవ్వాలన్నారు.

ప్రజలతో పాటు కరోనా నియంత్రణకు ముందుండి పని చేస్తున్న వైద్యారోగ్య, పోలీసు, పారిశుధ్య సిబ్బంది, కార్మికుల ఆరోగ్య రక్షణను బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఆపద సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాల‌ని కోరారు. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళాలు ఆర్టీజీఎస్‌, ఆన్‌లైన్‌, చెక్కు, డీడీ రూపంలో ఇవ్వొచ్చన్నారు.ఈ సంద‌ర్బంగా దాత‌లు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాల చెక్కుల‌ మంత్రికి అంద‌జేశారు.

Indrakaran Reddy
TRS
Telangana
Corona Virus

More Press Releases