లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన వ్యక్తులను తరలించడానికి ప్రోటోకాల్: తెలంగాణ సీఎస్
లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన వారిని తరలించెందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారి చేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లోఈ అంశంపై ఉన్నాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరీశిలించి సందీప్ కుమార్ సుల్తానియాను నోడల్ అధారిటీగా నియమించింది. నోడల్ అధారిటీకి అధికారుల బృందం సహయ సహకారాలు అందిస్తుంది. రాష్ట్రంలో నిలిచి పోయిన వ్యక్తులను తరలించడానికి ప్రోటోకాల్ ను రూపొందించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయిన వారి రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల వివరాలను తెలుపవలసిందిగా కోరుతు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖను రాసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. తెలంగాణలో నిలిచిపోయిన వారిని, వారి రాష్ట్రాలకు తరలించడానికి అవసరమైన రవాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా కోరినట్లు ప్రధాన కార్యదర్శి వివరించారు.
అవసరమైన ఏర్పాట్ల కోసం తమ రాష్ట్రాలకు సంబంధించిన నోడల్ అధారిటీలను తెలంగాణ నోడల్ అధారిటీలతో సంప్రదించాలని సి.యస్ కోరారు. తెలంగాణలో నిలిచిపోయిన వారికి అవసరమైన స్ర్కీనింగ్ ను నిర్వహించి, వైరస్ లక్షణాలు లేని వారికి ప్రయాణం కోసం పాసులను తెలంగాణ నోడల్ అధారిటీ జారీ చేస్తుంది.
తెలంగాణ నిలిచిపోయి తమ స్వరాష్ట్రాలకు వెల్లాలనుకున్న వారు తమ రవాణ సోకర్యం కోసం ఆయ రాష్ట్రాలను సంప్రదించవలసివుటుంది. తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయి తమ రాష్ట్రాలకు వెల్లాలనుకున్న వారికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.
ఈ సమావేశంలో ముఖ్యకార్యదర్శులు వికాస్ రాజ్, సునీల్ శర్మ, పోలీస్ శాఖ అదనపు డి.జి. (L&O) జితేందర్, కార్యదర్శిలు సందీప్ కుమార్ సుల్తానియా, రాహుల్ బొజ్జా, రోనాల్డ్ రోజ్, డైరెక్టర్ సి.సి.ఎల్.ఎ రజత్ కుమార్ సైనీ పాల్గొన్నారు.