కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు లాక్ డౌన్ ను తప్పనిసరిగా పాటించాలి: ఆరోగ్య నిపుణుల సూచన
సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నాడు కరొనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాంధీ ఆస్పత్రి పల్మొనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రమోద్ కుమార్, అపోలో ఆసుపత్రి క్రిటికల్ కేర్ హెచ్ ఓ డి డాక్టర్ కే. సుబ్బారెడ్డి మాట్లాడారు.
కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు లాక్ డౌన్ తప్పనిసరి అని గాంధీ ఆస్పత్రి పల్మోనాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ అన్నారు. వ్యాధి తీవ్రతను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు. లాక్ డౌన్ తోనే చైన్ ను బ్రేక్ చేసే అవకాశం ఉంటుందన్నారు. సుమారు 85 శాతం మంది ప్రజలకు మైల్డ్ లక్షణాలతో తగ్గొపోతుందన్నారు. ముఖ్యంగా 60 ఏళ్ళు పైపడిన వారు తగు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. భౌతిక దూరాన్ని అలవర్చుకోవడం కచ్చితంగా అవసరమన్నారు. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు వస్తే వెంటనే వైద్యుల సలహాలను తీసుకొని సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవాలన్నారు.
మాస్కులను వాడుతూ, చేతులను సబ్బుతో విధిగా కనీసం 20 సెకన్ల పాటు శుభ్రపరచుకోవలన్నారు.పిల్లలు, 50 ఏళ్ల లోపు వారిలో మరణాల శాతం తక్కువగావుందన్నారు. డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ ఆసుపత్రి నుండి వెళ్ళాక కూడా కొంత సమయం క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు.
అపోలో ఆసుపత్రి క్రిటికల్ కేర్ హెచ్ ఓ డి డాక్టర్ కే. సుబ్బారెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయం లో వీలు అయినంత వరకు బయటకు రాకుండా ఉండాలని సూచించారు.ముఖ్యంగా వయసు పై బడిన వారు లాక్ డౌన్ సుమయంలో ఇంటిలోనే మొబిలిటీ ఉండేలా చూసుకుంటూ, సమతుల్య ఆహారం తీసుకుంటూ సరిపడా నిద్ర పోవలన్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు మస్కులను వాడాలని N 95 మాస్కులు కోవిడ్ వ్యాధితో బాధపడే వారికి వైద్యం చేసే వారికి అవసరమని తెలిపారు. అత్యవసర సేవలు అందించే పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, డాక్టర్లు తప్పనిసరిగా మాస్కులను ధరించాలన్నారు. గర్భవతులు భయపడవలసిన అవసరం లేదని తెలుపుతూ ఎప్పటికప్పుడు మెడికల్ చెక్ అప్ చేయించుకోవలన్నారు. చిన్న పిల్లలు ఆటల కోసం బయటకు పంపించే విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
చాలా వరకు పిల్లలు asymptomatic గా ఉంటూ ఇంట్లో వుండే పెద్దవారికి వ్యాపిం చేసే అవకాశం ఉందన్నారు. ఇంట్లో కూడా సాధ్యమైనంత వరకు సమాజిక దూరంను పాటించాలని సూచించారు. లాక్ డౌన్ కు ప్రజలు సమిష్టిగా తమ సహాయ సహకారాలు అందిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అన్నారు. ఈ మీడియా సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, ఇంచార్జి సి.ఐ.ఇ విజయ భాస్కర్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ డి.యెస్. జగన్ తదితరులు పాల్గొన్నారు.