పంజాగుట్ట శ్మ‌శాన‌వాటిక‌ను, స్టీల్ బ్రిడ్జి ప‌నుల‌ను ప‌రిశీలించిన మంత్రి త‌ల‌సాని‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌

Related image

హైద‌రాబాద్‌, ఏప్రిల్ 25: రోడ్డు విస్తరణలో భాగంగా స్థలం కోల్పోతున్న పంజాగుట్ట స్మశాన వాటికకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం పంజాగుట్ట స్మశాన వాటికను మేయర్ బొంతు రాంమోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్, కార్పొరేటర్ మన్నే కవితా రెడ్డిలతో కలిసి సందర్శించారు.

ముందుగా మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కార్యాలయంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ గంగ‌పుత్ర సంఘం కమిటీ సభ్యులు మంగళపల్లి రాజు, మహేందర్, నాగేష్, రాంమూర్తి, నవనీదర్ లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డు విస్తరణలో స్థలాన్ని కోల్పోతున్న తమకు ghmc అధికారులు ప్రత్యామ్నాయంగా 3 వేల గజాల స్థలం, నీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారని, కాని మాకు న్యాయం చేయకుండానే నిర్మాణ పనులు అధికారులు చేపట్టారని మంత్రికి వివరించారు.

స్పందించిన మంత్రి వెంటనే పంజాగుట్ట స్మశాన వాటికను సందర్శించి 17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. అదే విధంగా ప్రధాన రహదారిపై జరుగుతున్న బిటి రోడ్డు పనులను కూడా పరిశీలించారు.

More Press Releases