మెగాస్టార్ చిరంజీవి పిలుపు మేరకు రక్తదానం చేసిన మేడ్చల్ మున్సిపల్ కమిషనర్

Related image

మెగాస్టార్ చిరంజీవి రక్తదానం పిలుపు మెగా అభిమానులనే కాకుండా అధికారులను సైతం ఆకట్టుకుంటోంది. స్వచ్ఛందంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు వచ్చి రక్తదానం చేసి మెగాస్టార్ పట్ల తమ అభిమానాన్ని చాటుకోవడమే కాకుండా సామాజిక బాధ్యతని సైతం నిర్వర్తిస్తుండడం విశేషం. అందులో భాగంగానే మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ ఎం.ఎన్.ఆర్ జ్యోతి ఇవాళ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. ఆమె ఈ విధంగా రక్తదానం చేయడం ఆరవసారి. మున్సిపల్ కమిషనర్ గా అన్ని వర్గాల వారికి సేవలందిస్తూ.. చిరంజీవి పిలుపుకు స్పందనగా రక్తదానం చేసిన జ్యోతిని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మనస్ఫూర్తిగా అభినందించింది.

Chiranjeevi
Medchal Malkajgiri District
Hyderabad
Telangana

More Press Releases