అలీబాబా నలభై దొంగలుగా చంద్రబాబు, కన్నా, పవన్: ఏపీ మంత్రులు విమర్శ
- ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో WHO గైడ్ లైన్స్ కి అనుగుణంగా సోషల్ డిస్టన్స్ పాటిస్తూ.. విజయవాడలో రూ.100లకే పండ్ల అమ్మకం
- రైతులకు మేలు చేయాలని, నేరుగా రైతుల నుంచి ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రూట్స్ కిట్ అమ్మకం
పండ్లకు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. ఆక్వా రంగాన్ని ఆదుకుంటున్నామన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే ప్రతిపక్షాలు పని కట్టుకొని మరి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని స్కైప్ టీవీల్లో సూక్తులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తీరు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని మంత్రులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి, ఏడి దయాకర్, ఎన్జీవోస్, వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
పోలీసులకు ఫ్రూట్ జ్యూస్:
పశ్చిమ నియోజకవర్గంలోని వన్ టౌన్, టూ టౌన్, భవానిపురం పోలీస్ స్టేషన్ లకు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు ఫ్రూట్ జ్యూసులను అందజేశారు.