పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన తెలంగాణ మంత్రి పువ్వాడ

Related image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. నగరంలోని ఆమ్ బజార్ కూరగాయల దుకాణాలను సందర్శించారు. వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. SBI మెయిన్ బ్రాంచ్ లో పేదలకు ప్రభుత్వం వారి ఖాతాలో వేసిన రూ.1500 నగదు తీసుకునేందుకు వచ్చిన వారితో మంత్రి మాట్లాడారు. ఖాతాదారులకు ఏర్పాట్లు, బ్యాంక్ పనితీరు, సామాజిక దూరం పలు అంశాల వివరాలను లీడ్ బ్యాంక్ మేనేజర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద పారిశుధ్య కార్మికులను కలిసి వారితో మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్మన్  వెంకటేశ్వర్లు, జేసి వెంకటేశ్వర రావు, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు ఉన్నారు.

Puvvada Ajay Kumar
Bhadradri Kothagudem District

More Press Releases