చిరంజీవి పిలుపు మేరకు రక్తదానం చేసిన నటుడు ఉత్తేజ్

Related image

'అన్నమాట బంగారుబాట' అంటూ మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడలను అనుక్షణం ఆరాధనాపూర్వకంగా అనుసరించే నటుడు, కవి ఉత్తేజ్ ఇవాళ రక్తదానం చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి ఆయన శ్రీమతితో కలిసి వచ్చిన ఉత్తేజ్ మెగాస్టార్ చిరంజీవి పిలుపు మేరకు రక్తదానం చేశారు. అంతే కాకుండా తన ఆత్మీయ స్నేహితులు, సన్నిహితుల్ని సైతం సంప్రదించి వారు కూడా రక్తదానం చేసేలా ఉత్తేజపరుస్తానంటూ హామీ ఇచ్చారు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా చిరంజీవి అసలు సిసలైన హీరో అని కొనియాడారు. ఇలాగే మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకుని మరిన్ని మంచి పనులు చేయాలని ఆకాంక్షించారు.

Chiranjeevi
Hyderabad
uttej

More Press Releases