తెలంగాణ దాన్యబాండాగారాంగా మారింది: మంత్రి జగదీష్ రెడ్డి

Related image

  • ఖరీఫ్ కు ఎరువులు సిద్ధం
  • ఎరువుల విక్రయ కేంద్రాలుగా ఫంక్షన్ హాల్లు
  • సజావుగా ధాన్యం కొనుగోళ్లు
  • 1019 కొనుగోలు కేంద్రాల గుర్తింపు
  • 937 కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభం
  • రెండున్నర నుండి మూడు శాతానికి పెరిగిన కొనుగోలు కేంద్రాలు
  • ఉమ్మడి జిల్లాలో 4 లక్షల 31 వేల 276 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు
  • 1,19,4140 లక్షల గన్ని బ్యాగుల వినియోగం
  • అందుబాటులో 60,12,212 లక్షల గన్నీ బ్యాగ్ లు
  • బత్తాయి,నిమ్మ రైతులకు ప్రభుత్వం బాసట
  • కరోనా ను నిరోదించడమే నివారించడం
  • అందుకు బత్తాయి,నిమ్మలు దోహద పడుతాయి
  • నల్గొండలో బత్తాయి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించిన మేర తెలంగాణ రాష్ట్రం దాన్యబాండాగారాంగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు కరోనా వైరస్ ప్రబలడంతో ఆ సంతోషాన్ని రైతులతో సంబురంగా పంచుకోలేక పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కరోనా వైరస్ ను నిరోదించడమే నివారించడం అని అందుకు బత్తాయి జ్యుస్ దోహదపడుతుందని ఆయన చెప్పారు.
బత్తాయి,నిమ్మ రైతులకూ ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా కేంద్రంలోనీ బత్తాయి మార్కెట్ లో బత్తాయి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ అధ్యక్షత న జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రెండు దశాబ్దాల నుండి ఉన్నదన్నారు.

టి.ఆర్.యస్ పార్టీ అధికారంలోకి రాగానే బత్తాయి, నిమ్మ రైతాంగం డిమాండ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారన్నారు.అందులో భాగంగానే నల్గొండ బత్తాయి నకిరేకల్ లో నిమ్మ మార్కెట్లను ప్రారంభించిన అంశాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయన్నారు.ముందెన్నడూ లేని రీతిలో పంట దిగుబడి పెరగడంతో కొనుగోళ్ల కేంద్రాలు భారీగా పెరిగాయన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లాల వారిగా నల్గొండ 427,సూర్యపేట315,యాదాద్రి భువనగిరి జిల్లాలో 277 కలుపుకుని మొత్తం 1019 కొనుగోలు కేంద్రాల ఆవశ్యకత ను ప్రభుత్వం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు.అందులో ఇప్పటికే మూడు జిల్లాలను కలుపుకుని 937 కేంద్రాలు (నల్గొండలో421,సూర్యపేట లో 271,బోనగిరి యాదాద్రి లో 245 ) ప్రారంచినట్లు ఆయన వెల్లడించారు.

కొనుగోలు కేంద్రాల ద్వారా మూడు జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం 4,31,276 మెట్రిక్ టన్నుల  ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు.జిల్లాల వారిగా చుస్తే ఒక్క నల్గొండ జిల్లాలో నే ఇప్పటివరకు 2 లక్షల 36 వేల 073 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం సూర్యపేట జిల్లాలో 1,69,983 లక్షల మెట్రిక్ టన్నులు,బోనగిరి యాదాద్రి జిల్లాలో 25 వేల 280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు కోటి 19 లక్షల 41వేల422  గన్ని బ్యాగ్ లను వినియోగించగా 62 లక్షల 92వేల 212 గన్ని బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు చేర్చినట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా పెరిగిన పంట దిగుబడిని గుర్తించిన అధికార యంత్రాంగం మరో కోటి 26 లక్షల 58 వేల 191 గన్ని బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.కొనుగోళ్లు మొదలు పెట్టిన రోజు నుండి ఇప్పటి వరకు సజావుగా కొనసాగాయని ఎక్కడ రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న దాఖలాలు లేవు అన్నారు.అందుబాటులో ఉన్న హామాలీలతో రైస్ మిల్లర్స్ కొనుగోళ్ల విషయంలో జరిపిన సమన్వయం కూడా కొనుగోళ్లు ముమ్మురంగా జరిగేందుకు దోహద పడ్డాయని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

అదే విదంగా ఖరీఫ్ పంటకు అవసరమైన ఎరువులను రైతులకు  అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆయన ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫంక్షన్ హాల్లాన్ని ఎరువుల విక్రయ కేంద్రాలుగా ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీచేశారని ఆయన చెప్పారు. ముందస్తుగా కొనుగోలు చేయాలనుకునే రైతాంగం సంబంధించిన అధికారులను సంప్రదించాలని మంత్రి జగదీష్ రెడ్డి రైతులకు విజ్ణప్తి చేశారు.

More Press Releases