తెలంగాణ సీఎం సహాయ నిధికి ఎన్ఆర్ఐ పైళ్ళ మల్లారెడ్డి రూ.కోటి 116 విరాళం
- పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో ఐటీ మంత్రి కేటీఆర్ కు అందజేత
ధనలక్ష్మీ ట్రేడర్స్ రూ.5 లక్షల విరాళం:
సిఎం సహాయ నిధికి ధనలక్ష్మీ ట్రేడర్స్ రూ.5లక్షల విరాళం ప్రకటించింది. ఈ విరాళం మొత్తానికి చెక్కుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావుకి శనివారం ప్రగతి భవన్ లో ఆ సంస్థ ప్రతినిధి రమేశ్ కుమార్ చౌదరి అందచేశారు. తమ వంతుగా ఈ సహాయాన్ని అందచేస్తున్నట్లు, కరోనా నిర్మూలనకు ఉపయోగించాలని ఆయన కోరారు.
సునంద ఇన్ ఫ్రా టెక్ విరాళం రూ.లక్ష:
సునంద ఇన్ ఫ్రా టెక్ సంస్థ సిఎం సహాయ నిధికి రూ.లక్ష విరాళాన్ని ప్రకటించింది. ఈ మొత్తానికి చెక్కుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి సునంద ఇన్ ఫ్రా టెక్ సంస్థ ప్రతినిధులు మంత్రుల నివాసంలో అందచేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, కరోనా వైరస్ నిర్మూలనకు ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలిపారు.