పెంపుడు జంతువుల నుండి కరోనా వ్యాధి సోకదు: తెలంగాణ పశు వైద్య, పశుసంవర్ధక శాఖ

Related image

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాధి COVID-19 మనుషుల నుండి జంతువులకు అలాగే జంతువుల నుండి మనుషులకు సోకే అవకాశం ఎంత మాత్రం లేదని తెలంగాణ రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా.వి.లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. హైదరాబాద్ మహానగర సంస్థ పరిధిలో సుమారు 2 లక్షల పెంపుడు కుక్కలు ఉన్నయని తెలుపుతు, కొందరు యజమానులు ఇటివల కాలంలో కరోనా వ్యాధి జంతువుల నుండి మనుషులకు సోకుతుందనే అపోహతో పెంపుడు కుక్కలను వీధులలో వదిలి వెళ్ళుతున్నారని మా దృష్టికి వచ్చినట్లు తెలుపుతూ అలా చేయకూడని తెలిపారు. ఈ కరోనా వైరస్ మనుషుల నుండి జంతువులకు సోకుతుందని పుకార్లు, వదంతులు, నమ్మోద్దన్ని, దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని తెలియజేశారు. అలాగే, పెంపుడు జంతువుల యజమానులు పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.

More Press Releases