కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్దతును విస్తరించిన టీవీఎస్ మోటార్ కంపెనీ డీలర్స్

Related image

తిరుపతి, ఏప్రిల్ 15, 2020: దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారితో పోరాటం సాగిస్తూ దాని బారినుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునందించేందుకు బాధ్యతాయుతమైన కార్పోరేట్ పౌరునిగా టీవీఎస్ మోటార్ కంపెనీ కట్టుబడి ఉంది. స్థానిక ప్రజల యొక్క ఆరోగ్యం, సంపదకు భరోసానందించాలనే సిద్ధాంతానికి అనుగుణంగా టీవీఎస్ మోటార్‌కంపెనీ డీలర్‌షిప్స్ ఇప్పుడు తమ చుట్టు పక్కల ప్రాంతాలలో కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు చురుకైన చర్యలు చేపట్టాయి.

టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క ప్రధాన డీలర్ కేశ్విన్ ఆటోమోటివ్స్, తిరుపతి ఇప్పుడు ఆహార సరుకులను డోర్ డెలివరీ ద్వారా డీలర్‌షిప్ ఉద్యోగుల ఇంటి వద్దనే అందించింది. కర్నూలులోని అపర్ణ ఆటోమోటివ్స్, కర్నూలు రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రజలకు రాత్రి పూట భోజనాలను సరఫరా చేసింది. కడియంలోని గోదావరి మోటార్స్, స్ధానికంగా ఉన్నటువంటి 1000 మందికి కూరగాయల ప్యాకెట్లను అందజేసింది.

నమ్మకం, విలువ, వినియోగదారుల పట్ల అభిరుచి, ఖచ్చితత్త్వం అనేవి మా శతవసంతాల వారసత్వంలో పాతుకుపోయాయి.
అంతర్జాతీయంగా ఆసక్తి కలిగిన ఉత్పత్తులను అత్యున్నత నాణ్యతతో సృజనాత్మకత, స్థిరమైన ప్రక్రియల ద్వారా తయారుచేస్తుండటం పట్ల మేము గర్వంగా ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలలో మా అన్ని టచ్ పాయింట్ల వద్ద అత్యున్నతమైన వినియోగదారుల అనుభవాలను అందించడానికి మేము కృషి చేస్తున్నాం. ప్రతిష్టాత్మకమైన డెమింగ్ ప్రైజ్ అందుకున్న ఒకే ఒక్క ద్విచక్రవాహన కంపెనీ మాది. మా ఉత్పత్తులు సంబంధిత విభాగాలలో అగ్రగామిగా జెడీ పవర్ ఐక్యుఎస్, అపీల్ సర్వేలలో గత ఐదు సంవత్సరాలుగా వెలుగొందుతున్నాయి. వరుసగా మూడు సంవత్సరాలు జెడీ పవర్ కస్టమర్ సర్వీస్ శాటిశ్ఫాక్షన్ సర్వేలో నెంబర్ 1 కంపెనీగా నిలుస్తున్నాం. 

More Press Releases