సీఎం కేసీఆర్ నిర్ణయాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు: మంత్రి ఎర్రబెల్లి
*రైతాంగానికి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత అధికారులదే*
*సమన్వయం చేసే బాధ్యత ప్రజా ప్రతినిధులు తీసుకోవాలి*
*రైతుల కోసం నిబంధనలను సరళతరం చేశాం*
*కోల్డ్ స్టోరేజీల్లో పంటలను నిల్వచేసే రైతులకు వడ్డీలేని రుణాలు*
*ధాన్యం, మక్కలతోపాటు మిర్చీ పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది*
*ప్రధాన మార్కెట్లలో మిర్చీ కొనుగోళ్ళు మొదలయ్యాయి*
*ఆఖరు గింజ వరకు ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుంది*
*రైతులు ఆందోళన పడాల్సిన పని లేదు-భరోసాగా ఉండండి*
*చేతులెత్తి మొక్కుతున్నాం... ఇండ్లల్లోనే భద్రంగా ఉండండి*
*లాక్ డౌన్ కి ప్రజలు పూర్తిగా సహకరించాలి*
*సిఎం కెసిఆర్ నిర్ణయాలకి పూర్తిగా కట్టుబడి ఉందాం*
*కరోనా వైరస్ ని సమూలంగా కట్టడి చేద్దాం*
*కరోనా వైరస్ కట్టడిలో పోలీసులు అధికారులు రాజీ పడొద్దు*
*ధాన్యం, మక్కజొన్న కొనుగోలు, కరోనా వైరస్ నిర్మూలన లపై ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులతో సమీక్షించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*
వరంగల్, ఏప్రిల్ 13: కోరానా నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజలే కాదు... దేశం, ప్రపంచమంతా హర్షిస్తున్నది. ఇక సీఎంగారి నిర్ణయాలను అమలు పరిచే బాధ్యత అధికారులదే... ఆ నిర్ణయాలను ప్రజలకు అందుబాదటులోకి రావడానికి వీలుగా అధికారులు-ప్రజల మధ్య అనుసంధానం, సమన్వయం చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు తీసుకోవాలి. కరోనా కష్ట కాలంలో ప్రజలంతా కట్టడిగా ఉండాలి. లాక్ డౌన్ ని పాటించాలి. ఇక రైతాంగం నుంచి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. మద్దతు ధర లభించేలా చేస్తున్నాం. మిర్చీ పంటలు కూడా కొనుగోలు మొలయ్యాయి. రైతులు భరోసాగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కెసిఆర్ గారు ప్రజల్ని, రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి అన్ని విధాలుగా కష్ట పడుతున్నారని, మనం చేయాల్సిందల్లా సిఎం గారికి సహకరించడమే.... అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం మంత్రి హన్మకొండలోని నందన గార్డెన్ లో వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో కలిసి, ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్క్ ఫెడ్, మార్కెట్, గిడ్డంగులు, పోలీసులు, వైద్యులు... వంటి పలు శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడితో మాట్లాడారు.
కరోనా వైరస్ ని నిర్మూలించడంలో సిఎం కెసిఆర్ నిర్ణయాలను దేశం, ప్రపంచమంతా అభినందిస్తున్నది. అందరికంటే ముందే... లాక్ డౌన్ వంటి కఠిన, సాహసోపేతమైన నిర్ణయాలను ఆయన తీసుకున్నారు. అవన్నీ సత్ఫలితాలిస్తున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఆయనకు సహకరించడమేనని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రైతాంగానికి మద్దతు ధర లభించే విధంగా, ధాన్యం, మక్కజొన్నలు కొనుగోలు చేసే విధంగా నిబంధనలను సీఎంగారు సరళతరం చేశారన్నారు. మిర్చీ పంటలను కూడా మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నామన్నారు. ఒకవేళ తమ పంటలను ఇప్పుడే అమ్ముకోవడానికి సిద్ధంగా లేని రైతుల కోసం ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీ గోదాముల్లో వారి పంటలను నిలువ పెట్టుకోవడమే గాక, ఆ పంటల మీద వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తున్నదన్నారు. ఇలాంటి పథకం దేశంలోనే ఎక్కడాలేదన్నారు. ఎనుమాముల మార్కెట్ లో 10 మంది మిర్చీ రైతులు తమ పంటలను నిలువ చేసుకున్నారని, వారిలో ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున ఇచ్చినట్లు తెలిపారు. ఆఖరు గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి దయాకర్ రావు రైతాంగానికి భరోసా ఇచ్చారు.
ఇక లాక్ డౌన్ ని ప్రజలు పూర్తిగా పాటించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలన్నారు. కరోనా చైన్ ని తెంచివేయాలంటే... తెగించి సామాజిక, భౌతిక దూరం పాటించాలని, లాక్ డౌన్ లో ఉండాలని మంత్రి అన్నారు. అధికారులు, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సిఎం కెసిఆర్ గారు తీసుకుంటున్న అన్ని చర్యలూ అద్భుతంగా ఉన్నాయని, రాష్ట్ర ఖజానాను సైతం లెక్క చేయకుండా, ప్రజల ప్రాణాలను రక్షించడానికి అన్ని విధాలుగా సిఎం గారు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజావసరాలు తీరేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. లాక్ డౌన్ కి ప్రజలు పూర్తిగా సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ సమీక్ష, మీడియా సమావేశాల్లో... మంత్రి ఎర్రబెల్లితోపాటు రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్, డిసిసిబి చైర్మన్ మార్నేని రవిందర్ రావు, వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, హరిత, పోలీసు కమిషనర్ రవిందర్, మార్క్ ఫెడ్ జీఎం భాస్కరాచారి, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెట్ వంటి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.