దాతృత్వానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తున్న హైద‌రాబాద్: మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌

Related image

  • గుజ‌రాతి స‌మాజ్ సెంట్ర‌ల్ కిచెన్ సెంట‌ర్‌ను సంద‌ర్శించిన మేయ‌ర్

  • రోజుకు 5వేల ఆహార ప్యాకెట్ల‌ను పంపిణీ చేస్తున్న గుజ‌రాతి స‌మాజ్‌

హైద‌రాబాద్‌, ఏప్రిల్ 10: దాతృత్వానికి హైదరాబాద్ నిదర్శనంగా నిలుస్తుందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్ నందు గుజరాతి సేవా మండలి ఆధ్వర్యంలో నెలకొల్పిన సెంట్రల్ కిచెన్ ను సందర్శించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతిరోజు 5 వేల మందికి ఉచితంగాభోజనం పెడుతున్న గుజరాతి సమాజాన్ని అభినందించారు. ఆకలితో ఏ ఒక్కరూ ఇబ్బంది పడరాదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారని గుర్తుచేశారు.

అందులో భాగంగా ముఖ్యమంత్రి పిలుపుకు స్పందించి నిరుపేదలు, వలస కూలీలతో పాటు కరోనా వైరస్ నియంత్రణకు శ్రమిస్తున్న క్షేత్రస్థాయి పోలీసులు, ఇతర సిబ్బందికి ఆహార పాకెట్లను అందిస్తున్నారని ప్రసoశించారు. వృద్దులు, నిరాశ్రయులకు ఆహార పాకెట్లను, నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో రాష్ట్ర పోలీస్ హోజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర గుప్తా, గుజరాతి సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఘనశ్యాం దాస్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

Hyderabad
bonthu ram mohan
Telangana
TRS

More Press Releases