వ్యవస్థలను విధ్వంసం చెయ్యాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు: ఏపీ మంత్రులు

Related image

  • కనపడని శత్రువుతో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది
  • చంద్రబాబు హోమ్ క్వారంటయిన్ లో ఉండి ఉత్తరాలు రాస్తున్నారు
  • ఏపీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు
వ్యవస్థలను విధ్వంసం చెయ్యాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని, ఆర్ధిక వ్యవస్థను విధ్వంసం చేసి చంద్రబాబు నీతులు చెప్తున్నారు అని మంత్రులు కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గురువారం కేబీఎన్ కళాశాల వద్ద జరిగిన పేదలకు కూరగాయల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కన్నబాబు అతిధిగా పాల్గొన్నారు.
మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్: 
  • పేదలకు సాయం చేయాలని నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నాం.
  • ప్రభుత్వంపై బురద చల్లాలని చంద్రబాబు లేఖలు రాస్తున్నారు.
  • కరోన వైరస్ ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు.
  • బీజేపీ, సీపీఐ, జనసేన,పార్టీలు చంద్రబాబు తోక పార్టీల మాదిరిగా వ్యవహరిస్తున్నాయి.
మంత్రి కన్నబాబు కామెంట్స్:
  • కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవడానికి మంత్రులు ముందుకు వస్తున్నారు.
  • ఒక్కో నియోజకవర్గంలో 40 వేల మందికి నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేస్తున్నాం.
  • సోషల్ డిస్టన్స్ ద్వారా ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నాం.
  • కరోన పోరులో ప్రజలకు వైద్యంతో నిత్యావసర వస్తువుల పంపిణీ కూడా చాలా అవసరం.
  • చంద్రబాబు ఇంకా భ్రమలో ఉన్నారా లేకా నైజం అలా ఉందొ అర్థం కావడం లేదు.
  • వ్యవస్థలను విధ్వంసం చెయ్యాల్సిన అవసరం ప్రభుత్వానికి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదు.
  • ఆర్ధిక వ్యవస్థను విధ్వంసం చేసి చంద్రబాబు నీతులు చెప్తున్నారు.
  • విపత్కర పరిస్థితిలో మీ పాలన ఎలా ఉందో ఉత్తరాంధ్ర ప్రజలు చెప్తున్నారు.
  • టీడీపీ అధికారంలో ఉండగా టమాటకు గిట్టుబాటు ధరలు కల్పించారా అని ప్రశ్నించారు.
  • నష్టం వచ్చిన మొక్కజొన్న, జొన్న, రబి, టమాటా, అరటి కొనుగోలు చెస్తున్నాం.
  • కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి న్యాయం చెయ్యమని చంద్రబాబు ఎందుకు లేఖ రాయడం లేదు.
  • పోస్టు కార్డుల ఉద్యమంలాగా చంద్రబాబు లేఖలు రాస్తున్నారు.
  • విపత్తులు వస్తే రాజకీయ రాబంధులాగా ఆనంద పడుతున్నారు.

Vellampalli Srinivasa Rao
Jagan
Kannababu
YSRCP
Chandrababu
Andhra Pradesh

More Press Releases