క్యారంటైన్ లో కరోనా అనుమానితులకు మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ

Related image

  • త్వరితగతిన కొలుకుంటారంటూ భరోసా

  • సూర్యపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఇమాంపేటలో క్యారం టైన్ సందర్శన

  • కరోనా వైరస్ అనుమానితులలో అవగాహన పెంచేందుకు ప్రయత్నం

  • ఆత్మవిశ్వాసం పెరిగితే వైరస్ తగ్గుతుంది

  • సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యేంత వరకు ప్రభుత్వ సంరక్షణలోనే

  • వైద్యం పూర్తిగా ఉచితం

  • పూర్తి సౌకర్యాలు కల్పించేందుకు భరోసా

  • రోగనిరోధక శక్తి బత్తాయి,నిమ్మ దోహదపడుతుంది

ఆత్మవిశ్వాసం తోటే ఎంతటి వ్యాధినైనా తగ్గించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సూర్యపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఇమాంపెటలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఆయన బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. కరోనా వైరస్ అనుమానంతో క్యారంటైన్ గా మారిన సాంఘిక సంక్షేమ వసతి గృహంలో వైద్యం పొందుతున్న వారిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బుధవారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ తరహా అనుమానితుల్లో అవగాహన పెంపొందించి ఆత్మవిశ్వాసం పెంపొందించగలిగితే కరోనాను అధిగమించడం సులబతరమౌతుందని ఆయన పేర్కొన్నారు.

కరోనా వైరస్ అనుమానంతో చికిత్సలు పొందుతున్న వారిని మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. కరోనా బారిన పడడం అన్నది తెలిసి జరిగేది కాదని తెలువకుండా జరిగిన పొరపాటుకు క్యారంటైన్ లో ఉండి తగిన చికిత్సలు పొందడమే నివారణోపాయమని ఆయన సూచించారు. అందుకు మనోధైర్యమే శ్రీరామరక్ష అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందులో భాగమే నని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే దూరంగా ఉంటున్నామన్న చింతను వదలి సమాజానికి ఎంతో మేలు చేస్తున్నామన్న కోణంలో ఆలోచన చేయగలిగితే మీలో పూర్తి ఆత్మవిశ్వాసం పెరిగి వైరస్ మీద విజయం సాధించి జనబాహుళ్యంలోకి రావడానికి సులువు అవుతుందంటూ ఆయన హితవు పలికారు. వసతుల కల్పనలో కొన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయంటూ అక్కడ చికిత్సలు పొందుతున్న వారు మంత్రి దృష్టికి తీసుకరాగా సత్వరమే క్యారంటైన్ లో మౌలిక వసతులు కల్పించాలంటూ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.

అంతే గాకుండా రోగనిరోధక శక్తికి దోహద పడతాయని నిపుణులు చెబుతున్న బత్తాయి, నిమ్మలను వారికి అందించాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఆర్డిఓ మోహన్ రావు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

G Jagadish Reddy
Corona Virus
Telangana

More Press Releases