స్వీయ నిర్బంధమే కరోనా వైరస్ నివారణకు ఏకైక మార్గం: నిమ్స్ హాస్పిటల్ అడిషనల్ ప్రొఫెసర్

Related image

స్వీయ నిర్బంధమే కరోనా వైరస్ నివారణకు ఏకైక మార్గమని నిమ్స్ హాస్పిటల్ అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.వి. ఎస్. సుబ్బలక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సోమవారం నాడు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో బోర్డు రూంలో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిమ్స్ హాస్పిటల్ అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.వి. ఎస్. సుబ్బలక్ష్మి, అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ రవికిరణ్  సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రజలు స్వీయ నియంత్రణలోనే ఉంటె కరొనను నియంత్రిచగలమని అన్నారు. అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రజలు బయటికి రావాలని ప్రతి వ్యక్తి భౌతిక దూరాన్ని విధిగా పాటించాలని తెలిపారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు గాని, దగ్గినప్పుడు గాని వెలువడిన  తుంపర్లలో వైరస్ ఉండి ... వారిని మనం తాకినా లేదా అవి మనకు ముక్కు, నోరు, కండ్ల మార్గాల ద్వారా ప్రవేశించి ఈ  వైరస్ సోకుతుందని తెలిపారు.

సాధారణంగా కరోనా వైరస్ సోకినా చాల మందిలో కొన్ని రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనపడక పోవడం ఈ వైరస్ ప్రత్యేకత అని తెలిపారు. తమకు తెలియకుండానే వారు ఈ వైరస్ ని ఇతరులకు వ్యాప్తి చేస్తారని తెలిపారు. ఈ వైరస్ బయట పడడానికి సాధారణంగా 2 నుండి 14 రోజుల సమయం తీసుకుంటుందని, దీనినే ఇంక్యుబేషన్  పీరియడ్ గా  వ్యవహరిస్తారని తెలిపారు. వృద్దులు, చిన్న పిల్లలు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బయటికి వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా శానిటైజర్ తోగాని, సబ్బు నీటితోగాని  కనీసం 20 సెకండ్లపాటు శుభ్రపరుచుకోవాలని అన్నారు. కరోనా వైరస్ పై అనుమానం ఉంటె ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని నిర్భయంగా డాక్టర్లను సంప్రదించాలని అన్నారు. కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తు.చ. తప్పక పాటించాలని తెలిపారు. ఈ సందర్బంగా ఆమె  క్లాత్ మాస్క్, సర్జికల్ మాస్క్, ఎన్ 95 మాస్కుల గురించి వివరించారు. ప్రజలు మాస్కులు వాడిన అనంతరం ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా చెత్త డబ్బాలోనే వేయాలని సూచించారు. 

అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ లాక్ డౌన్ ఉన్నప్పటికీ కొత్తగా కేసులు నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తున్నదని తెలిపారు. కొంతమంది ప్రజలు తమకు కరోనా సోకిందని భయపడుతున్నారని, కరోనా వైరస్ సోకిన  లక్షణాలు ఉంటే డాక్టర్ని కలవాలని తెలిపినారు. కరోనా కాకుండా ఇతర వ్యాధులు ఉంటే వివిధ హాస్పిటల్స్ ఆన్ లైన్ అప్పాయింట్ మెంట్ సౌకర్యం కల్పిస్తున్నందున ఆన్ లైన్ ద్వారా తగు చికిత్సలు పొందే అవకాశం ఉందని తెలిపారు. గుండె నొప్పి , డయాలసిస్, పెరలాసిస్ , డయాబెటిస్ జబ్బులతో బాధపడే వారికీ కరోనా వైరస్ సోకె రిస్క్ శాతం ఎక్కువగా ఉంటుందని  తెలిపారు. అవసరం లేక పోయిన ప్రజలు మాస్కులు , మందులు కొనుగోలు చేయడం ద్వారా వ్యాధి సోకిన వారికీ కొరత ఏర్పడుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని , అనవసర కొనుగోలు చేయరాదు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల  మరణాలు 2 శాతం మాత్రమే ఉందని స్పష్ట్టం చేశారు.  

ఈ సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, ఇంచార్జి చీఫ్ ఇంజనీర్ విజయ్ భాస్కర్ రెడ్డి, డి. డి. శ్రీనివాస్,  డి. డి. హష్మీ , ఆర్.ఐ .ఇ  రాధా కిషన్,  తదితరులు పాల్గొన్నారు.

More Press Releases