నిత్యావసర సరుకులు, కిట్లను పంపిణీ చేసిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

కరోనా వ్యాధి నివారణ చర్యల కు గాను మున్సిపల్ కార్మికులకు నిత్యావసరాల సరుకులు, కిట్లను పంపిణీ చేసిన మంత్రి డా"వి. శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ పట్టణంలోని మహబూబ్ నగర్ మున్సిపాలిటిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కు నిత్యావసర సరుకులు మరియు రక్షణ చర్యల కోసం సానిటైజార్ కిట్ లను, పురుష కార్మికులకు టీ షర్టులు, మహిళా కార్మికులకు చీరలను  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు,మున్సిపల్ కమిషనర్ సురేందర్, వైస్ చైర్మన్ తాటి గణేష్, ,ప్లోర్ లీడర్లు షబ్బీర్ అహ్మద్, కట్టా రవికిషన్ రెడ్డి, కౌన్సిలర్ రాము తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నిరంతరం కరోనా వైరస్ నివారణ కోసం పనిచేస్తున్న కార్మికులు డాక్టర్లు దేవుళ్లతో సమానం అని పేర్కొన్నారు

రోజు పనిచేసి ఇంటికి వెళ్ళే సమయంలో తల స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళాలి అని,పని చేయడానికి వస్తున్నపుప్పుడు నిమ్మరసంతో కూడిన పానీయాలను సేవించడం మంచిది అని తెలిపారు, తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలి అని మనిషికి మనిషికి మధ్య దూరంగా పాటిస్తూ తగిన జాగ్రత్తలను పాటించాలని తెలిపారు.

More Press Releases