పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి ఎర్రబెల్లి
మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్
కరోనాను నిర్మూలించే వరకు ఈ యుద్ధం ఆగొద్దు
కరోనా అంతానికి మనం చేస్తున్న లాక్ డౌన్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు
మన ఐక్యతకు, ఓపికకు, పోరాట పటిమకు నిదర్శనంగా లాక్ డౌన్
ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ ఆవిశ్రాంతంగా పోరాడుతున్నారు
వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు
వాళ్ళకు ప్రజలు పూర్తిగా సహకరించాలి
కరోనా కట్టడి అయ్యే వరకు గుళ్ళు, మసీదులు, చర్చీలకు పోవడం మానండి
రాయపర్తిలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం
తిరుమలాయపల్లిలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ పిచికారి
ప్రలజకు మాస్కుల పంపిణీ-పేదలకు ఉచిత బియ్యం పంపిణీ
పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి ఎర్రబెల్లి
రాయపర్తి, (వరంగల్ రూరల్ జిల్లా), ఏప్రిల్ 4: 'మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ ని నిర్వహించాలి. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ళను వీడొద్దు. కరోనా నిర్మూలనకు మనం చేస్తున్న లాక్ డౌన్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. సంపూర్ణ లాక్ డౌన్ మన ఐక్యతను, సహనాన్ని, పోరాట పటిమను చాటుతున్నది. గుళ్ళు, మసీదులు, చర్చీలకు వెళ్ళడాన్ని ప్రజలు మానేయాలి. సిఎం కెసిఆర్ అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ప్రజా సంక్షేమానికి ఎంతకైనా వెళతారు. ప్రజల్ని రక్షించడానికి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఉద్యోగులంతా నిరంతరం ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. మనం అంటే ప్రజలంతా వాళ్ళకి సహకరించాలి. కరోనా నిర్మూలన జరిగే వరకు కంప్లీట్ లాక్ డౌన్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలగకుండా చూడాలి.' అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పాలకుర్తి నియోజకవర్గం, వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని రాయపర్తి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. తిరుమలాయపల్లిలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాయపర్తి వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ ని స్వయంగా మంత్రి పిచికారి చేశారు. ప్రలజకు మాస్కుల పంపిణీ - పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయా చోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముందే మేల్కొని తీసుకున్న నిర్ణయం లాక్ డౌన్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. ఈ తేదీకల్లా...రాష్ట్రంలో కరోనా కట్టడి అయ్యేదని చెప్పారు. దురదృష్టవశాత్తు కొందరు ఢిల్లీకి వెళ్ళి రావడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, స్వచ్ఛందంగా పరీక్షలకు వెళ్ళకుండా ఉండటం వంటి కారణాల వల్ల కరోనా విస్తృతి మరికొంత జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందుకు తగ్గట్లుగా అనేక ఏర్పాట్లు చేసిందన్నారు. అయితే కరోనా నిర్మూలనకు చికిత్సకంటే, అది రాకుండా చూసుకోవడమే మంచిదన్నారు. అందుకే ప్రజలు మరికొంత కాలం లాక్ డౌన్ ని కట్టుదిట్టంగా పాటించాలని మంత్రి సూచించారు.
ప్రజలు పారిశుద్ధ్యాన్ని పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ అడిషనల్ కలెక్టర్ మహేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.