పోలీసు శాఖకు 90 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని పంపిణీ చేసిన మేయర్ బొంతు రామ్మోహన్

Related image

పోలీసు శాఖకు 90 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని పంపిణీ చేసిన : మేయర్ బొంతు రామ్మోహన్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి:

హైద‌రాబాద్‌, ఏప్రిల్ 03: కోవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నివసించే ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదని హైదరాబాద్ నగర మేయర్  బొంతు రామ్మోహన్ అన్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని జీఎన్ఎంసీ పునరావాస కేంద్రాలు, భవన నిర్మాణ రంగం కార్మికులు, పోలీస్ షెల్టర్ లో ఉన్నవారికి, పోలీసు కిందిస్థాయి సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించడానికి బియ్యం అందించాలని పోలీసు శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ శుక్రవారం నాడు జీఎస్ఎంసీ కార్యాలయంలో 9000 కిలోల నాణ్యమైన సన్న బియ్యాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ తరఫున అడిషనల్ ఎసిపి శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంప నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి  కే. చంద్రశేఖర రావు మానవతా దృక్పథంతో రాష్ట్రంలోని నిరుపేదలకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు ఉచితంగా 12 కిలోల బియ్యాన్ని అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సహాయానికి తోడుగా ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పేదలకు నాణ్యమైన భోజనం అందించేందుకు తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బియ్యాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ సందర్భంగా పౌరసరఫరాల సంస్థ చైర్మన్  మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి క్లిష్టసమయంలో పేదలకు సహాయంగా నిలబడినందుకు తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జీఎచ్ఎంసీ, పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. అడిషనల్ ఎస్పిఆర్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందించిన బియ్యాన్ని అవసరమైన చోట వండి పెడతామని, అవసరమైన వారికి బియ్యాన్ని అందిస్తామని తెలిపారు.

More Press Releases