పీఎం, సీఎం సహాయ నిధులకు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ చేయూత

Related image

  • ప్రధాని సంరక్షణకు నిధికి నెల జీతం, సిఎం సహాయ నిధికి రూ.లక్ష
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కరోనా విపత్తు నేపథ్యంలో తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర ప్రధమ పౌరుని హోదాలో కరోనా వ్యాప్తి నిరోధం కోసం తన వంతు ప్రయత్నాన్ని చేస్తూనే మఖ్యమంత్రి మొదలు ఆయా శాఖల ఉన్నతాధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. తనకున్న సుదీర్ఘ ప్రజా జీవితం ఆలంబనగా అధికార గణంకు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని ఆయా విశ్వ విద్యాలయాల కులపతి హోదాలో విద్యార్ధులను సైతం ఆ దిశగా కార్యోన్ముఖులను చేయాలని ఉపకులపతులను ఆదేశించారు. రాష్ట్ర రాజ్యాంగ అధినేతగా అన్ని చేస్తూనే, వ్యక్తిగతంగా కూడా తన పెద్ద మనస్సును చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి సైతం స్వయంగా వివరించిన బిశ్వభూషణ్ రాష్ట్ర ఆరోగ్య స్ధితి గతులను మెరుగు పరిచేందుకు తన వంతుగా చిరు విరాళంను అందిస్తున్నానన్నారు.

విశాలమైన జాతీయ భావాలు కలిగిన హరిచందన్ మరోవైపు ప్రధాని సంరక్షణ నిధికి సైతం తన నెల రోజుల జీతాన్ని విరాళంగా సమకూర్చాలని నిర్ణయించి ఆమేరకు నిధులను బదిలీ చేయాలని రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమర్ మీనాను ఆదేశించారు. ప్రస్తుత పరిస్ధితులలో ప్రతి ఒక్కరూ దాతృత్వం చూపాలని, దాతలు సమకూర్చే ప్రతి రూపాయి ఈ దేశంలో ఆరోగ్య పరిస్ధితులను మెరుగు పరిచేందుకు ఉపయోగపడుతుందని గవర్నర్ అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి సామాజిక దూరం పాటించటం మాత్రమే కీలకం అయినందున, ప్రతి ఒక్కరూ తదనుగుణంగా వ్యవహరించాలన్నారు.

Biswabhusan Harichandan
COVID-19
Corona Virus
Andhra Pradesh

More Press Releases