ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారుల విరాళం రూ.20 లక్షలు: సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్

Related image

  • ఐఏఎస్ అధికారుల విరాళం రూ.20 లక్షలు: సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో అఖిల భారత సర్వీసు అధికారులు తమదైన శైలిలో స్పందించారు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ పరంగా చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు చేయూతను అందించేందుకు ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 162 మంది అధికారులు తమ మూడు రోజుల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించాలని నిర్ణయించినట్లు ఐఏఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, పర్యాటక సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

మూడు రోజుల జీతంగా రూ.20 లక్షలు తాము ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించనున్నామని, ఈ క్రమంలో తమ జీతాల నుండి ఆ మొత్తాలను మినహాయించాలని ఆర్ధిక శాఖ కార్యదర్శికి లేఖ రాశామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నామని ప్రవీణ్ కుమార్ వివరించారు. రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారులు కరోనా వ్యాప్తి నిరోధం నేపథ్యంలో విభిన్న బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని, విపత్కర పరిస్ధితిలో పాలనా యంత్రాంగాన్ని సీఎం ఆదేశాల మేరకు ముందుకు నడిపించటంలో తమదైన పాత్రను పోషిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఎటువంటి బాధ్యతలనైనా నిర్వర్తించేందుకు అఖిల భారత సర్వీసు అధికారులు సిద్ధంగా ఉన్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

More Press Releases