పశుగ్రాసం, దాణాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: తెలంగాణ మంత్రి తలసాని

Related image

పశుగ్రాసం, దాణా ను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అలాంటి వారిపై pd యాక్ట్ క్రింద కేసు నమోదు చేయాలని తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంర్ధక శాఖ కార్యాలయంలోని తన చాంబర్ లో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, డెయిరీ md శ్రీనివాస్ రావు లతో సమావేశం నిర్వహించారు.

లాక్ డౌన్ పరిస్థితులను అదనుగా చేసుకొని మూగ జీవాలకు వేసే దాణా ను అధిక ధరలకు విక్రయించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. దాణా కిలో 22 నుండి 25 రూపాయలు, పచ్చిగడ్డి 2 నుండి 2.50 రూపాయలకు, వరిగడ్డి 5 రూపాయల నుండి 6.50 రూపాయల వరకు, కుట్టి 7 రూపాయల నుండి 7.50 రూపాయల వరకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ఎవరైనా దాణా, పశుగ్రాసాన్ని అధిక ధరలకు విక్రయిస్తే పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9121213220 నెంబర్ కు పిర్యాదు చేయాలని రైతులకు మంత్రి తెలిపారు. వ్యాపారులు దాణా కృత్రిమ కొరత సృష్టించకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం పశుగ్రాసం, దాణా, పాలు, నిత్యావసర వస్తువులు సరఫరా చేసే అన్ని వాహనాలను అనుమతిస్తుందని చెప్పారు.

More Press Releases