తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల పనితీరుపై మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సమీక్ష

Related image

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి అదేశాల మేరకు రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల పనితీరుపై ఈ రోజు సచివాలయంలో రాష్ట్ర అబ్కారి, పర్యాటక మరియు సాంస్కృతికశాఖ మంత్రి శ్రీ వి.శ్రీనివాస్ గౌడ్ గారు సమీక్షించారు.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక కమీషనర్ దినకర్ బాబు, టూరిజం యం.డి.మనోహర్ రావు, పర్యాటక శాఖ జాయిట్ సెక్రటరీ కె.రమేష్ , సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లె, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పర్యాటక క్షేత్రాల అభివృద్ది పై సమీక్షిస్తు రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన కార్యచరణను రూపొందించాలని, దానికి సంబంధించి అవసరమైన ప్రతిపాదనలను తయారు చేయాలని మంత్రి సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని పర్యాటకులను అకర్షించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టను ఒక అద్బుతమైన పర్యాటక కేంద్రంగా రూపోందించే విధంగా ప్రణాళికలను తయారు చేయాలని మంత్రి శ్రీ వి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. దీనితో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మితమైన ప్రాజెక్టు, కాళేశ్వరం దేవాలయం సందర్శన కోసం ప్రత్యేక టూరిస్టు ప్యాకేజీని ఏర్పాటు చేసి అత్యదిక సందర్శకులు దర్శించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రాల కు పెట్టని కోట అని, వాటిని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం రావటం తో పాటు అనేక మంది పర్యాటకులను ఆకర్షించే విధంగా కృషిచేయాలన్నారు.

దీనితో పాటు ఆదిలాబాద్ , వరంగల్ , మహబూబ్ నగర్ జిల్లాలలోని పర్యాటక కేంద్రాలను మూడు కొత్త సర్కూట్ లగా తయారు చేసి రాష్ట్రంలో ఉన్న ఇతర చారిత్రక , వారసత్వ , అధ్యాత్మిక కేంద్రాలతో అనుసంధానం చేసి అభివృద్ది చేయాలని సూచించారు. దీని ద్వారా పర్యాటకులను ఆకర్షించటమే గాక ఉపాధి అవకాశాలు కూడా మెరుగువుతాయి , ప్రభుత్వానికి అదాయం సమకూరుతుందని మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

 ప్రస్తుతం ఉన్న పర్యాటక కేంద్రాలతో పాటు కొత్త పర్యాటక కేంద్రాలపై విస్తృత ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. ఈ ప్రచారానికి గాను శాఖా పరంగా ఉన్న హోర్డింగ్ లను మరియు ఇతర ప్రచార మాధ్యమాలను ఉపయోగించు కోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర పర్యాటక శాఖ అధ్వర్యంలో నడుపుతున్న తిరుపతి, షిర్డీ మరియు ఇతర అధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల సందర్శన ప్యాకేజీ వివరాలను ప్రజలకు తెలిసే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. దీనికి గాను ఆకర్షనీయమైన డిజైన్ లను తయారు చేసి , పర్యాటక వివరాలు , ప్యాకేజీ రేట్లు ఆకట్టుకునే రీతిలో ప్రజలకు తెలిసే విధంగా పర్యాటక బస్సుల పైన ప్రదర్శించాలని మంత్రి సూచించారు.

 ఈ విధమైన ప్రచారాన్ని జంట నగరాలలో తిరిగే పర్యాటక , సెట్విన్ బస్సులపై కుడా ప్రదర్శన చేయాలని మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్
సూచించారు.

More Press Releases