భయపడకండి - జాగ్రత్తలు పాటిస్తే కరోనా దగ్గరకు రాదు: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ

Related image

తగిన జాగ్రత్తలు తీసుకుంటే (కొవిడ్-19) కరోనా వైరస్ తెలంగాణ ప్రజల దరిచేరదని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ స్పష్టం చేసింది. ముందు జాగ్రత్త చర్యల వల్ల వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చని ఆ శాఖ అధికారులు వివరించారు. జూబ్లిహిల్స్ లోని టీ-శాట్ స్టూడియో ద్వార మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందికి ప్రత్యేక అవగాహణ కార్యక్రమం ప్రత్యక్ష్య ప్రసారం ద్వార వైద్యాధికారుల బృందం అందించింది.

తెలంగాణ ప్రభుత్వం వ్యాధిని అడ్డుకోవడంతో పాటు నివారించడానికి కట్టుదిట్టమపై చర్యలు చేపట్టిందని, రాష్ట్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని బృందం స్పష్టం చేసింది. కరోనా వ్యాధిని అడ్డుకోవడానికి పరిశుభ్రతే ప్రాథమిక సూత్రంగా భావించాలని, వైద్యుల సూచనలు పాటిస్తే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం రాదని బృందం స్పష్టం చేసింది. జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితో ఇబ్బందులు ఎదుర్కొనే వారు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 104 లేదా ఆరోగ్య అధికారులను సంప్రదించి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ సుధీర స్పష్టం చేశారు.

శ్వాస కోస ఇబ్బందులు ఎక్కువగా ఉన్నపుడు, వ్యాధి సోకి విదేశాల నుండి వచ్చిన వారితో కలిసి తిరిగినపుడు మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అటువంటి పరిస్థితులు మన తెలంగాణలో లేవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు, మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్, సీవీహెచ్ వో డాక్టర్ శ్రవణ్ రెడ్డి, యూనీసెఫ్ ప్రతినిధి శ్రీకృష్ణ పాల్గొన్నారు.

అవగాహన కార్యక్రమానికి ప్రత్యేక ఆదరణ:

టీ-శాట్ నెట్ వర్క్ ఛానళ్ల ఆధ్వర్యంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ నిర్వహించిన ‘కరోనా వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్త’లు కార్యక్రమానికి యూట్యూబ్ లో విశేష ఆదరణ లభించింది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు టీ-శాట్ వేదికగా వైద్యుల బృందం నిర్వహించిన కార్యక్రమానికి ఏకకాలంలో సుమారు 3,600 మంది వీక్షకులు లభించడం శోచనీయం. అవగాహణ కార్యక్రమాల నిర్వహణలో ఏ తెలుగు ఛానల్ కు రాని విధంగా వేలాదిగా వీక్షకులుండటం శోచనీయమని టీ-శాట్ సీఈవో ఆర్. శైలైష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య, వ్యవసాయ, మహిళా శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖలు నిర్వహించే అవగాహన కార్యక్రమాలు కూడా విజయవంతం అయ్యాయని సీఈవో స్పష్టం చేశారు.

More Press Releases