నూతనంగా రూపొందించిన కోర్సుల బ్రోచర్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్!

Related image

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెట్విన్ సంస్థ నూతనంగా రూపొందించిన కోర్సుల బ్రోచర్ ను తన అధికార నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ MD వేణుగోపాల్, ట్రైనింగ్ మేనేజర్ నర్సింహ రావులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సెట్విన్ కేంద్రాల ద్వారా నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చి వారికి ఉపాధితో పాటు ఉద్యోగాల కల్పన సెట్విన్ సంస్థ ద్వారా హైదరాబాద్ జంట నగరంతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాల ద్వారా సుమారు నిరుద్యోగ యువతి, యువకులకు 24 స్వంత కేంద్రాలు, 57 ఫ్రాంచైజ్ ల ద్వారా 47 వృత్తి నైపుణ్య కోర్స్ లలో శిక్షణను అందించి, సుమారు 4 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించామన్నారు.

పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు మారుతున్న పరిస్థితులకు, ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా సెట్విన్ ఆధ్వర్యంలో 1, బయోమెడికల్ ఇంజినీరింగ్ ఎక్విప్ మెంట్ సర్వీసింగ్, 2, అఫ్తాల్మాలజీ ఎక్విప్ మెంట్ సర్వీసింగ్, 3, PCB రిపేర్ టెక్నీషియన్, 4, ఫైర్ అలారం ఇన్స్టలేషన్ అండ్ మెయిoటెన్స్ కోర్స్ లను విద్యానగర్ లోని శిక్షణ కేంద్రంలో త్వరలో ప్రారంభించుచున్నాము. కోర్స్ డిమాండ్ ను బట్టి మిగిలిన కేంద్రాలకు విస్తరిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

More Press Releases