ఎస్ఆర్డీపీ క్రింద చేపట్టిన అన్ని పనులను వేగంగా పూర్తి చేయాలి: మంత్రి కేటీఆర్

Related image

ఎస్ఆర్డీపీ క్రింద చేపట్టిన అన్ని పనులను వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. సోమవారం జి హెచ్ ఎం సి కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జిహెచ్ ఎంసి కమీషనర్ డిఎస్ లోకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, డిస్కమ్, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎస్ఆర్డీపీ పనుల వారీగా ప్రగతిని సమీక్షించారు. మౌళిక వసతుల అభివృద్ధికి, సులభ రవాణా కు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ లు, అండర్ పాసులు, ఇతర పనులను  ఏక కాలంలో కట్టుటకు అదనపు మెటీరియల్, మాన్ పవర్, యంత్రాలను డిప్యూట్ చేయించాలని ఆదేశించారు.

ప్రస్తుతం రోజుకు 5-6 గంటలు మాత్రమే జరుగుతున్న పనులను 24 గంటల పాటు కొనసాగించుటకు ఆయా ప్రాంతాలలో ఒకవైపు రహదారిని మూసి, ట్రాఫిక్ డైవర్ట్ చేసేందుకు పోలీస్ అధికారులతో మాట్లాడనున్నట్లు తెలిపారు. అయితే మెన్, మెటీరియల్  ను సమకూర్చుకోవాలని ఏజెన్సీలకు స్పష్టం చేశారు. ఏకకాలంలో అన్ని చోట్ల పనులు జరగాలని చెప్పారు. ఒక స్పాన్ తర్వాత మరొకటి, ఒక వైపు మొదలు పెట్టి వరుసగా చేస్తూ చివరివైపు ముగించడం వలన జాప్యం జరుగుతుంది. అన్ని స్పాన్స్ పనులు జరుగుతుoడాలని చెప్పారు. ఏజెన్సీలతో ఎట్లా వేగంగా పనులు చేయించాలో అనే అంశం పై పనుల వారిగా సూక్ష్మ స్థాయి ప్లాన్ వుండాలి. సృజనాత్మకంగా ఆలోచించండి. నిధులు సమృద్ధిగా వున్నాయి. బిల్లులు చెల్లిస్తున్నాం. భూ సేకరణ, పబ్లిక్ యుటిలిటీ నిర్మాణాలను తొలగించడంలో జాప్యం వద్దు. వాటర్ వర్క్స్, డిస్కామ్ అధికారులు సహకరించాలి. తీసుకున్న పనులను సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత ఏజెన్సీ లపై వున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

More Press Releases