తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అటవీ సంరక్షణ చర్యలు స్ఫూర్తి దాయకం: ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్

Related image

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అటవీ సంరక్షణ చర్యలు స్ఫూర్తి దాయకంగా ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ డాక్టర్ బీ.ఎం.కే. రెడ్డి.

హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ అరణ్య భవన్ లో తెలంగాణ అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అటవీ శాఖ అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ వివరించారు. తెలంగాణకు హరితహారం విశిష్టత, గత ఐదేళ్లుగా సాధించిన ప్రగతితో పాటు, జంగల్ బచావో, జంగల్ బడావో నినాదాన్ని అమలు చేస్తూ అటవీ సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పీసీసీఎఫ్ వివరించారు. అడవుల సహజ పునరుద్దరణ, అటవీ ప్రాంతాల రక్షణకు కందకాల ఏర్పాటు, పెద్ద ఎత్తున అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు వివరాలను తెలిపారు. కంపా నిధుల ద్వారా చేపట్టి, విజయవంతమైన ప్రత్యామ్నాయ అటవీ పెంపకం విధానాలను వెల్లడించారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతిలను ప్రతిష్టాత్మకంగా చేపట్టంతో పాటు స్థానిక సంస్థల నిధుల్లో పదిశాతం పచ్చదనం అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లు పీసీసీఎఫ్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా పర్యావరణ రక్షణకు ప్రాధాన్యతను ఇస్తోందని డాక్టర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో విజయవంతం అయిన విధానాలను పరిశీలించేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైనట్లు డాక్టర్ రెడ్డి తెలిపారు.

సమావేశంలో అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, ఎం.సీ. పర్గెయిన్, సిద్దానంద్ కుక్రేటీ, డిప్యూటీ కన్జర్వేటర్ రామ్మూర్తి, ఇతర అధికారులు పాల్గొని, తమ పరిధిలో వచ్చే అటవీ శాఖ కార్యక్రమాలను వివరించారు.

More Press Releases