సిటిజన్ షిప్ (అమెండ్మెంట్) యాక్టును ర్దదు చేయండి.. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ కేబినెట్ విజ్ఞప్తి

Related image

భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మత పరమైన వివక్ష చూపరాదని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగం ప్రసాదించిన లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేసేలా పరిణమించిన సిటిజెన్ షిప్ (అమెండ్మెంట్) యాక్టును ర్దదు చేయాలని కేబినెట్ కోరింది. ఈ మేరకు కేబినెట్ లో తీర్మానం చేశారు. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలో కూడ ఇందుకు సంబంధించి తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

CAA
Telangana Cabinet
KCR
Narendra Modi
Telangana

More Press Releases