గిరిజనుల ఆరాధ్య దైవం జయంతి వేడుకలలో తెలంగాణ మంత్రి పువ్వాడ

Related image

ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శాసనసభ్యులు రాములు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ 281వ జయంతి మహోత్సవం వేడుకలకు ముఖ్య అతిధిగా తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు.

సంప్రదాయ గిరిజన వేషధారణలో మంత్రి పువ్వాడ హోమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారా ప్రజల అభ్యున్నతికి పాటుపడిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వ తరపున నిధులు మంజూరు చేసి అధికారికంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 

Khammam District
puvvada ajay kumar
Telangana

More Press Releases