కుంటినవలసలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. ఏడాదిలో నిర్మాణాలు పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తనను కలిసిన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి, డీన్ ప్రొఫెసర్ ఎం.శరత్ లకు హామీ ఇచ్చారు.
