ప్రేమ, విధి మధ్య జరిగే సంఘర్షణ 'దీర్ఘసుమంగళీభవ'... ఏప్రిల్ 7 నుంచి జీ తెలుగులో!

ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్లతో సాగే సీరియల్స్ను అందిస్తున్న జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్ను అందించేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునే కథ, కథనం ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు అందిస్తున్న సరికొత్త సీరియల్ ‘దీర్ఘసుమంగళీభవ’. అమ్మమ్మ అమర్నాథ్ యాత్ర కలను సాకారం చేసేందుకు అహల్య చేసే ప్రయత్నం, విధికి బలైన అహల్య, ఇంద్ర జీవితాలతో ఈ కథ ముడిపడి ఉంటుంది. బంధాలు, బంధుత్వాల మధ్య ఉద్వేగభరితంగా సాగే సీరియల్ ‘దీర్ఘసుమంగళీభవ’ ఏప్రిల్ 7న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటలకు, మీ జీ తెలుగులో మాత్రమే!
అహల్య (మహీ గౌతమి) టైలర్గా పనిచేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న తన అమ్మమ్మను అమర్‌నాథ్ యాత్రకు తీసుకెళ్లాలని కలలు కంటుంది. అక్కడ ఇంద్ర (పవన్ రవీంద్ర) అనే సైనికుడితో ప్రేమలో పడుతుంది. అతను తన గతంతో పోరాడుతుంటాడు. ఇంద్ర మరణంతో వారి ప్రేమ విషాదకరంగా ముగుస్తుంది. ప్రేమ, విధికి మధ్య బంధీ అయిన అహల్య భవిష్యత్తు ఎలా ఉంటుంది? అహల్య జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సోమవారం జీ తెలుగులో ప్రారంభమయ్యే దీర్ఘసుమంగళీభవ సీరియల్ని తప్పకుండా చూడండి!
ప్రతిభావంతులైన నటీనటులు, కుటుంబ నేపథ్యంతో సాగే కథాంశంతో వస్తున్న దీర్ఘసుమంగళీభవ జీ తెలుగు ప్రేక్షకులకు చక్కని అనుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. ఈ సీరియల్లో మహీ గౌతమి, ప్రతాప్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పవన్ రవీంద్ర, శ్రీలక్ష్మి, జాకీ, ఆశా రాణి, సుమిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ షోలోని అద్భుతమైన తారాగణం తమ నటనా ప్రతిభతో అందరినీ ఆకట్టుకోనుంది మరియు కథాంశం వీక్షకులను నిరంతరం ఆకర్షిస్తుంది.
కొత్త సీరియల్ దీర్ఘసుమంగళీభవ ప్రారంభంతో జీ తెలుగు ఇతర సీరియల్స్ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు ముక్కుపుడక సీరియల్ మధ్యాహ్నం 12 గంటలకు, సీతే రాముడి కట్నం సీరియల్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రసారం కానున్నాయి. జీ తెలుగు ప్రేక్షకులు దయచేసి ప్రసార సమయాల్లో మార్పుని గమనించగలరు!
భావోద్వేగాల సమాహారంగా రూపొందుతున్న దీర్ఘసుమంగళీభవ.. ఏప్రిల్ 7 నుంచి సోమవారం - శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటలకు, మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!