ZEE5లో ఉగాది పండుగ సంబరాలు.. మార్చి 28న రాబోతోన్న ‘మజాకా’

సందీప్ కిషన్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘మజాకా’. ఈ చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. హాస్య ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని రాజేష్ దండ నిర్మించారు. ఫిబ్రవరి 26న రిలీజ్ అయిన ఈ చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. నవ్వుల బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది.
సందీప్ కిషన్ రీసెంట్ ఎంటర్టైనర్ ‘మజాకా’ జీ5లోకి రాబోతోంది. ఉగాది సందర్భంగా ఈ చిత్రం మార్చి 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో జీ5 వీక్షకులు ఉగాది నవ్వుల బ్లాక్ బస్టర్‌తో జరుపుకోబోతోన్నారు. ఆల్రెడీ జీ5లో రీసెంట్‌గానే సంక్రాంతికి వస్తున్నాం, మ్యాక్స్, కుడుంబస్తన్ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్‌లుగా దూసుకుపోతోన్నాయి.
ప్రస్తుతం జీ5లో సంక్రాంతికి వస్తున్నాం, మ్యాక్స్, కుడుంబస్తన్ వంటి చిత్రాలు టాప్‌లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఉగాది సందర్భంగా ‘మజాకా’ రాకతో వినోదం రెట్టింపు కానుంది. నవ్వుల బ్లాక్ బస్టర్‌ను చూసి ఈ ఉగాదికి అందరూ ఎంజాయ్ చేయండి.
ZEE5 గురించి...
జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది.