నితిన్, రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ అతిథులుగా ‘ఉగాది మాస్ జాతర’.. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో!

నిరంతరం వైవిధ్యమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. ప్రతిరోజూ ఆసక్తికరమైన సీరియల్స్, వారం వారం సరికొత్త సినిమాలతో పాటు పండుగలకు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులకు అంతులేని వినోదం పంచుతున్న జీ తెలుగు ఈ ఉగాదికి మరో అదిరిపోయే కార్యక్రమంతో అలరించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో నితిన్, రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్, ప్రదీప్ మాచిరాజు తదితరులు అతిథులుగా హాజరైన తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేడుక ఉగాది మాస్ జాతర, మార్చి 30 ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!
నూతన సంవత్సరాది ఉగాది పండగని జీ తెలుగు నటీనటులందరూ ఘనంగా జరుపుకున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో హీరో నితిన్ ముఖ్య అతిథిగా హాజరై తన కొత్త సినిమా రాబిన్హుడ్ విశేషాలు పంచుకున్నారు. యాంకర్ రవి, సిరి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో నటీనటులందరూ రెండు గ్రూపులుగా విడిపోయి రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ టీమ్ లీడర్లుగా సిటీ Vs విలేజ్ థీమ్లో పోటీపడ్డారు. అంత్యాక్షరీ, ఆటలు, పాటలు సరదా అల్లరితో కార్యక్రమం ఆద్యంతం సందడిగా సాగింది. డ్రామా జూనియర్స్ పిల్లలు రమ్య కృష్ణ ముందు నరసింహ సినిమాలోని పాపులర్ సీన్స్ని రీక్రియేట్ చేసి అలరించారు. అంతేకాదు, ఈ కార్యక్రమంలో చందు గౌడ కుమార్తె అక్షరాభ్యాసం వేడుక ఘనంగా నిర్వహించారు.
జీ తెలుగు నటీనటులు, ప్రముఖ సినీతారలతో సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో అశిక, భూమి, సంగీత, రీతు, మహేశ్వరి, హన్విక తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. మానస్- తేజస్విని, నిరుపమ్- పల్లవి పుష్ప, పుష్ప 2 ప్రత్యేక ప్రదర్శనలతో మరింత జోష్ నింపారు. అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి సినిమాతో రాబోతున్న ప్రదీప్ మాచిరాజు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఆటలు, పాటలు, అల్లరి, అద్భుత ప్రదర్శనలు, సరదా సంబరాలతో సాగిన ఈ ఉగాది మాస్ జాతరని జీ తెలుగు వేదికగా మీరూ తప్పక చూడండి!