వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం

వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్-కామెడీ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందబోతుంది. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ నిర్మాణంలో S థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వరుణ్ తేజ్ సరసన రితిక నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ కూడా జరుపుకోనుంది. వరుణ్ తేజ్ పాత్ర ఈ చిత్రంలో సరికొత్తగా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. ఈ హిలేరియస్ అడ్వంచరస్ మూవీకి సంబధించిన మరిన్ని అప్‌డేట్స్ ని మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.