విజయ్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన GOAT వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ తెలుగులో!

హైదరాబాద్, 18 మార్చి 2025: వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం మరో కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతోంది. కోలీవుడ్ స్టార్హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమాని ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందించేందుకు సిద్ధమైంది. థియేటర్లో సూపర్హిట్గా నిలిచిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందకు వచ్చేస్తోంది. విజయ్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ GOAT మార్చి 23, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ తెలుగులో మాత్రమే!
గాంధీ (విజయ్), స్పెషల్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (SATS) సభ్యుడు, మేనన్ (మోహన్) నేతృత్వంలోని టెర్రరిస్ట్ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు కెన్యాలో ఒక మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, బ్యాంకాక్‌లో ఒక మిషన్‌లో ఉన్నప్పుడు, గాంధీ తన కుమారుడు జీవన్ (విజయ్) మరణించినట్లు తెలుసుకుంటాడు. కానీ కొన్నాళ్ల తర్వాత రష్యాలో జీవన్‌ను సజీవంగా కలుసుకుంటాడు. జీవన్ నిజంగా గాంధీ కొడుకేనా? అతనికి మేనన్‌తో ఏదైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే GOAT సినిమా మిస్ కాకుండా చూసేయండి!
వెంకట్ ప్రభూ దర్శకత్వంలో, AGS ఎంటర్టైన్‌మెంట్ నిర్మించిన GOAT కథ, కథనంతోపాటు నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో వెండితెర ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రంలో హీరో విజయ్ భిన్నమైన పాత్రలో నటించగా, మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, మోహన్, ప్రశాంత్ లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా నిలిచింది. విజయ్ యాక్షన్ సీక్వెల్ మిస్కావొద్దంటే మీరూ ఈ ఆదివారం GOAT సినిమా తప్పకచూడండి!
ఇళయదళపతి విజయ్ సూపర్హిట్ సినిమా GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్), ఈ ఆదివారం మీ జీ తెలుగులో, డోంట్ మిస్!