ఆదివారం హంగామా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హోలీ స్పెషల్ ఈవెంట్ అక్కడ అమ్మాయిలు-ఇక్కడ అబ్బాయిలు, డియర్ బ్రదర్ టెలివిజన్ ప్రీమియర్.. మీ జీ తెలుగులో!

హైదరాబాద్, 14 మార్చి 2025: వారం వారం సరికొత్త సినిమాలు ప్రత్యేక కార్యక్రమాలతో అలరించే జీ తెలుగు ఈ ఆదివారం(మార్చి 16) అదిరిపోయే లైనప్తో వచ్చేస్తోంది. ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉదయం 9 గంటలకు, హోలీ స్పెషల్ మెగా ఈవెంట్ అక్కడ అమ్మాయిలు-ఇక్కడ అబ్బాయిలు మధ్యాహ్నం 12:30 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు డియర్ బ్రదర్ టెలివిజన్ ప్రీమియర్ను అందించేందుకు సిద్ధమైంది మీ జీ తెలుగు!
విక్టరీ వెంకటేష్, సూపర్స్టార్ మహేష్బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా 2013లో విడుదలై మెగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు నిర్మించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ఆల్టైమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రికార్డులు సృష్టించింది. రీరిలీజ్ ట్రెండ్ ను ఫాలో అవుతూ మార్చి 8న మరోసారి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. ఈ ఆదివారం ఉదయం 9 గంటలకు జీ తెలుగు మీరూ మరోసారి ఈ సినిమాని తప్పకుండా చూడండి!
హోలీ వేడుకల్లో భాగంగా జీ తెలుగు మార్చి 9న నరసరావు పేటలో అక్కడ అమ్మాయిలు-ఇక్కడ అబ్బాయిలు పేరున మెగా ఈవెంట్ నిర్వహించింది. నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ క్రికెట్ గ్రౌండ్లో అభిమానుల కోలాహంతో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ ఈ ఆదివారం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ యాంకర్ రవి వ్యాఖ్యాతగా వ్యవహరించగా దీప్తి మన్నె & దర్శ చంద్రప్ప, ప్రీతి శర్మ & పృథ్వీలతో పాటు ఇతర జీ తెలుగు నటీనటులు హాజరై సందడి చేశారు. MAD2 సినిమా హీరోలు నార్నే నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్తోపాటు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హీరోహీరోయిన్ ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి ఈ వేడుకలో పాల్గొన్నారు. కమెడియన్ సద్దాం, సింగర్ యశస్వి ప్రేక్షకులను అలరించారు. రంగులు, సంగీతం, ఆనందంతో నిండిన ఈ వేడుక అభిమానులకు తమ అభిమాన తారలను కలిసే అవకాశం అందించింది. వైభవంగా జరిగిన ఈ వేడుకని మీరూ తప్పకుండా చూసేయండి!
అంతేకాదు, జయం రవి, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన డియర్ బ్రదర్ సినిమాను టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది జీ తెలుగు. కుటుంబ కథాచిత్రంగా రూపొందిన ఈ సినిమాలో భూమిక చావ్లా, రావు రమేష్, నటరాజన్ సుబ్రమణ్యం, విటివి గణేష్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఎం.రాజేష్ దర్శకత్వంలో స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాని జీ తెలుగు వేదికగా మీరూ తప్పక చూడండి!
ఆదివారం అంతులేని వినోదం మీ జీ తెలుగులో.. మిస్ కాకండి!