హీరో తేజ సజ్జా 'మిరాయ్' రిలీజ్ డేట్ ఫిక్స్!

హీరో తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం 'మిరాయ్'. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంలో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రను పోషిస్తున్నాడు, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న మిరాయ్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా 8 వేర్వేరు భాషలలో 2D మరియు 3D ఫార్మాట్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రక్షా బంధన్, స్వాతంత్ర్య దినోత్సవ సెలవులు దగ్గరగా వస్తున్నందున మిరాయ్ ఫెస్టివల్ స్పిరిట్ ని క్యాపిటలైజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.
రిలీజ్ డేట్ పోస్టర్‌లో, తేజ సజ్జా మంచు పర్వత శిఖరాల మధ్య నిలబడి, ఒక కర్రను పట్టుకుని, ఇంటెన్స్ గా చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఒక్క పోస్టర్‌లోనే సినిమా గ్రాండియర్ స్పష్టంగా కనిపిస్తుంది.
మిరాయ్ లో అద్భుతమైన తారాగణం వుంది, రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర మెమరబుల్ గా వుండబోతోంది. తేజ సజ్జా సరసన రితికా నాయక్ కథానాయికగా నటించింది.
తేజ సజ్జా అంకితభావం, కృషి ఈ చిత్రం ప్రోమోలలో స్పష్టంగా కనిపిస్తాయి. సూపర్ యోధ పాత్రకు ప్రాణం పోసేందుకు తేజ చాలా హార్డ్ వర్క్ చేశారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రంగా మలుస్తున్నారు. స్క్రీన్ పై పూర్తిగా కొత్త ప్రపంచాన్ని సృష్టించారని ప్రమోషనల్ మెటీరియల్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.