ఇట్స్ ఓకే గురు" సినిమా నుంచి 'నిలవదే నిలవదే..' లిరికల్ సాంగ్ రిలీజ్

Related image

చరణ్ సాయి, ఉషశ్రీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా "ఇట్స్ ఓకే గురు". ఈ చిత్రాన్ని వండర్ బిల్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సురేష్ అనపురపు, బస్వ గోవర్థన్ గౌడ్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మణికంఠ ఎం రూపొందిస్తున్నారు. త్వరలో ఇట్స్ ఓకే గురు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి 'నిలవదే నిలవదే..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

'నిలవదే నిలవదే..' పాటను సంగీత దర్శకుడు మోహిత్ రెహ్మానియక్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా..లక్ష్మీ ప్రియాంక ఫీల్ గుడ్ లిరిక్స్ రాశారు. సిద్ధార్థ్ మీనన్ ఆకట్టుకునేలా పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'నిలవదే నిలవదే ..ఎదురుగా నా మది..తపన తెరచాటులో..తగని ఆరాటమే, రెండై ఉన్న ప్రాణాలే ఒకటయ్యాయిలా, నీతో ఉన్న కాలాలే మధురమే...' అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.


Nilavadee Nilavadee
It's Okay Guru
Tollywood

More Press Releases