థియేటర్‌లోకి రాబోతున్న 'ఇట్స్ కాంప్లికేటెడ్‌'

Related image

సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ కృష్ణ అండ్ హిస్ లీల. 2020లో  కరోనా మహమ్మారి సమయంలో OTTలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయనున్నారు. డిజిటల్ లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 14న కొత్త ట్విస్ట్‌తో థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను 'ఇట్స్ కాంప్లికేటెడ్‌'గా మార్చారు. ఈ కొత్త టైటిల్, ప్రమోషన్స్  మరింత ఆసక్తిని పెంచాయి. తాజాగా మేకర్స్ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. నాకు సిద్దు రవికాంత్ తో మరో సినిమా చేయాలని వుండేది. ఇది రిలీజ్ చేస్తేగానే మరో సినిమా చేయనని అన్నారు(నవ్వుతూ) దీనికి ఫిబ్రవరి 14 రైట్ డేట్.  ఇది రీరిలీజ్ కాదు. థియేటర్స్ లో ఫస్ట్ టైం రిలీజ్, ముందు ఒక టైటిల్ అనుకున్నాం. కానీ ఆ టైటిల్ పెట్టనివ్వలేదు. తర్వాత 'ఇట్స్ కాంప్లికేటెడ్‌' డైరెక్టరే పెట్టారు. ఈ సినిమా థియేటర్స్ లో అందరితో కలసి చూడడం అనేది వెరీ గుడ్ ఫీలింగ్. ఇది రీరిలీజ్ కాదు. థియేటర్స్ లో ఫస్ట్ టైం రిలీజ్‌'' అన్నారు. 
 
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. సినిమాని థియేటర్స్ లో ఆడియన్స్ చుడాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఫిబ్రవరి 14 సినిమాకి యాప్ట్ రిలీజ్. థియేటర్స్ లో ఆడియన్స్ ఎక్సయిట్మెంట్ చూడాలని వుంది, అవుట్ అఫ్ ది బాక్స్ కథలు వుంటే రానా దగ్గరికి వస్తారు. రానా వాటిని అర్ధం చేసుకొని ముందుకు తీసుకెళతారు. ఇలాంటి కథలు చేయాలంటే కొందరు ధైర్యం చేయరు. రానా మాత్రం ఇలాంటి కథ చెప్పాలని అనుకుంటారు. ఈ కథ రానాకి చెబితే చాలా స్ట్రాంగ్ గా ఫీలయ్యారు. అక్కడే రానాకి ఈ సినిమా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాని ముందు థియేటర్స్ లో రిలీజ్ చేయాలనే అనుకున్నాం. నిజానికి థియేటర్స్ లో రిలీజ్ చేసుంటే సిక్స్ టైమ్స్ ఎక్కువ వచ్చేది'' అన్నారు. 


More Press Releases