మా నాన్న సూపర్ హీరో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ తెలుగులో!

హైదరాబాద్, 12 ఫిబ్రవరి 2025: వారం వారం సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం మరో కొత్త సినిమాతో రాబోతోంది. సుధీర్ బాబు, ఆర్ణ జంటగా నటించిన మా నాన్న సూపర్ హీరో సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం చేయనుంది. తండ్రీకొడుకుల అనుబంధంతో అల్లుకున్న కథతో రూపొందిన మా నాన్న సూపర్ హీరో ఫిబ్రవరి 16 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ తెలుగులో!
అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన మా నాన్న సూపర్ హీరో సినిమా తండ్రీకొడుకుల బంధంతో ముడిపడిన కథ. జాని(సుధీర్ బాబు) తన చిన్నతనంలోనే తండ్రి ప్రకాష్(సాయిచంద్)కి దూరమై అనాథాశ్రమంలో పెరుగుతాడు. వ్యాపారి అయిన శ్రీనివాస్(సాయాజీ షిండే) జానీని దత్తత తీసుకుని పెంచుకుంటాడు. చీటింగ్ కేసులో అరెస్టయిన శ్రీనివాస్ని జానీ ఎలా కాపాడతాడు? జాని తన కన్నతండ్రిని ఎలా కలుస్తాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారమయ్యే మా నాన్న సూపర్హీరో సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాలో సుధీర్ బాబు, ఆర్ణ హీరోహీరోయిన్లుగా నటించగా, సాయాజీ షిండే, సాయిచంద్, ఆమని, రాజు సుందరం కీలక పాత్రలు పోషించారు. హృదయాలను హత్తుకునే భావోద్వేగాలతో సాగే ఈ సినిమాని మీరూ తప్పకుండా చూసేయండి.
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా సుధీర్ బాబు నటించిన మా నాన్న సూపర్ హీరో ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ తెలుగులో!