డ్యాన్స్, ఎంటర్ టైన్ మెంట్..ప్రతి ఎలిమెంట్ "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్"లో ఉంటుంది!

Related image

డ్యాన్స్ ఐకాన్  సీజన్ 1కు కొనసాగింపుగా  "డ్యాన్స్ ఐకాన్  సీజన్ 2 వైల్డ్ ఫైర్" ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ లు గా వ్యవహరిస్తున్నారు. . ఈ నేపథ్యంలో డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ప్రెస్ మీట్ ను ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హోస్ట్ ఓంకార్ మాట్లాడుతూ -  ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ను మీ ముందుకు తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఫరియా అబ్దుల్లా హోస్ట్ గా చేస్తుండటం హ్యాపీగా ఉంది. శేఖర్ మాస్టర్ సెకండ్ టైమ్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ మీకు ఓవరాల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. డ్యాన్స్, ఎంటర్ టైన్ మెంట్..ఇలా మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుంది. "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్"లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారు. పంచభూతాల్లాంటి వారి పర్ ఫార్మెన్స్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో . అన్నారు.

హోస్ట్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ - డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 టైమ్ లో కూడా నన్ను హోస్ట్ గా అడిగారు. అప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల సీజన్ 1 చేయలేకపోయాను. ఇప్పుడు "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్"లో హోస్ట్ గా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఓంకార్, శేఖర్ మాస్టర్ తో కలిసి హోస్ట్ చేస్తుండటం ఆనందంగా ఉంది.. అన్నారు.


మెంటార్ యష్ మాస్టర్ మాట్లాడుతూ - డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సీజన్ 2 చేస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ షోను సరికొత్తగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క ఆడియెన్ ను ఆకట్టుకుంటుంది. ఆహాను సబ్ స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే చేసుకుని మా "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్"షోను చూడండి. ఫిబ్రవరి 14 నుంచి మిమ్మల్ని "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" ఎంటర్ టైన్ చేయబోతోంది. అన్నారు.

మెంటార్ మానస్ మాట్లాడుతూ - "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్"లో మెంటార్ గా వ్యవహరించే అవకాశం ఇచ్చిన ఓంకార్ అన్నయ్యకు థ్యాంక్స్. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 బిగ్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు సీజన్ 2 కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఓంకార్ గారు. ఆయనకు ఆడియెన్స్ పల్స్ తెలుసు. వన్ సెకండ్ అంటూ ఎలా ఉత్కంఠకు గురి చేస్తారో మీరంతా చూశారు. "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్"లో ఎన్నో థ్రిల్స్, సస్పెన్స్ లు ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ కే మాకు సినిమా కనిపించింది. ఫిబ్రవరి 14 నుంచి ఆహాలో "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" చూడండి. అన్నారు.


More Press Releases