లోకేష్ బర్త్‌డే సందర్భంగా మంగళగిరి విద్యార్థులకు "సొలారా" సేవలు!

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా, దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ కంపెనీల్లో ఒకటైన సొలారా తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద మంగళగిరి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యానికి సహాయపడేలా, హై క్వాలిటీ వాటర్ బాటిల్స్‌ను 1,200 మంది విద్యార్థులకు పంపిణీ చేసింది.
ఈ కార్యక్రమం మంగళగిరి పట్టణంలోని వీవర్స్ కాలనీలో ఉన్న మున్సిపల్ హైస్కూల్‌లో జరిగింది. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, “ప్రైడ్ ఆఫ్ మంగళగిరి” పేరుతో విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ లాగా విద్యార్థులు కష్టపడి అనుకున్నది సాధించాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిటీ మెంబర్ మీనవల్లి మచ్చర్ రావు మాట్లాడుతూ, లోకేష్ పాదయాత్ర తనకు ఎంత స్ఫూర్తి కలిగించిందో వివరించారు. ఎన్నారైలతో పాటు మరిన్ని సంస్థలు కూడా సమాజానికి సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందంగా గడిపారు.
సొలారా సంస్థ సీఈవో కొల్లి గోపాల్ కృష్ణ మాట్లాడుతూ “బడి పిల్లలను విద్యకు, విలువలకు మాత్రమే దగ్గర చేయాలి... రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న” విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం లో ఏ పార్టీ రంగులు కానీ, విద్యార్థులకి ఇచ్చిన బాటిల్స్ పైన ఈ సింబల్స్ లేకుండా చూశాము అని చెప్పారు ... పుట్టిన రోజున కూడా యువతకు ఉద్యోగాలు తెచ్చిపెట్టాలన్న లక్ష్యంతో దావోస్ లో కష్టపడిన మంత్రి లోకేష్ సంకల్పం స్ఫూర్తిదాయకం. అలాగే సమాజానికి సహాయం చేయాలని ఉద్దేశంతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశామని సొలారా సంస్థ సీఈవో కొల్లి గోపాల్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రావుకు గోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికా నుంచి తిరిగి వచ్చి భారత్ లో సొలారా ను ప్రారంభించారు కొల్లి గోపాల్ కృష్ణ. ఆన్ లైన్ మార్కెట్‌లో శరవేగంగా ఎదుగుతున్న కంపెనీగా సొలారా మంచి పనితీరు కనబరుస్తోంది. 2021లో ప్రారంభమైన ఈ కంపెనీ అనతి కాలంలోనే ఏడాదికి వంద కోట్ల టర్నోవర్ అందుకుంది. వచ్చే మూడేళ్లలో రూ. 500 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికా వాసులు ఎంత క్వాలిటీ కిచెన్ సామాగ్రిని ఇష్టపడతారో అంత క్వాలిటీని ఇండియన్స్ కు ఇచ్చే లక్ష్యంతో కొల్లి గోపాల్ కృష్ణ ఈ స్టార్టప్ ను ప్రారంభించారు. పన్నెండు వందల మందికిపై విద్యార్థులు, స్కూల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.